- Home
- Sports
- Cricket
- IND vs SA: రోహిత్, కోహ్లీలను ఔట్ చేసి.. భారత్ ను దెబ్బకొట్టిన కసిగో రబాడ రియాక్షన్ ఇదే..
IND vs SA: రోహిత్, కోహ్లీలను ఔట్ చేసి.. భారత్ ను దెబ్బకొట్టిన కసిగో రబాడ రియాక్షన్ ఇదే..
Kagiso Rabada: దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్‌లో జరుగుతున్న ఇండియా-దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో మొదటి రోజు సఫారీ బౌలర్ కసిగో రబాడ భారత్ ను దెబ్బకొట్టాడు. తన కెరీర్ లో 14వ సారి ఐదు వికెట్లను తీసుకున్నాడు.

<p>Kagiso Rabada</p>
South African cricketer Kagiso Rabada: సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్ లో కగిసో రబాడ మరోసారి విజృంభించాడు. ఐదు వికెట్లతో మెరిసి భారత్ ను 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితం చేశాడు. ఐదు వికెట్లు తీసుకోవడం తన కెరీర్ లో ఇది 14వ సారి.
Kagiso Rabada
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టెస్టు తొలి రోజు ఆటలో కసిగో రబాడకు ఐదు వికెట్లు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశాడు. తన ప్రదర్శనపై స్పందించిన రబాడ.. దక్షిణాఫ్రికా బౌలింగ్ సారథిగా ఉన్న ఒత్తిడి తనకు లేదనీ, సెంచూరియన్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటను ఆస్వాదించినందుకు సంతోషంగా ఉందని అన్నాడు.
సూపర్ స్పోర్ట్ పార్క్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ లో 17 ఓవర్లలో 5/44తో కసిగో రబాడ విజృంభించడంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (70*), మహ్మద్ సిరాజ్ (0*) లు ఉన్నారు.
<p>Kagiso Rabada</p>
రబాడ తన 61వ టెస్టులో 14వ సారి ఐదు వికెట్లు తీయడంతో అతని మొత్తం టెస్టు వికెట్ల సంఖ్య 285కు చేరింది. తొలిటెస్టులో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లను రబాడనే పడగొట్టాడు.
Kagiso Rabada
'ఇది నా పని, నేను చేయాల్సిందల్లా వికెట్లు తీయడమే. ఇది నాకు పెద్ద భారం కాదు. నేను బౌలింగ్ చేసిన విధానంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నా రోజు' అని మ్యాచ్ ముగిశాక రబాడ చెప్పుకొచ్చాడు.