MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: పాకిస్తాన్ పై భారత్ గెలుపు.. మనోళ్లు అదరగొట్టారు

IND vs PAK: పాకిస్తాన్ పై భారత్ గెలుపు.. మనోళ్లు అదరగొట్టారు

India vs Pakistan Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్ vs పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత ప్లేయర్లు అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 14 2025, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన భారత్
Image Credit : Getty

పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన భారత్

ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో దుమ్మురేపింది. ఈ విజయంతో ఆసియా కప్ చరిత్రలో భారత్ మరోసారి పాకిస్తాన్‌పై తన దూకుడు ఆధిపత్యాన్ని నిరూపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది
Image Credit : ANI

టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది

ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.  పాక్ కు ఇది పెద్దగా కలిసి రాలేదు. ఉన్న పిచ్‌పై భారత బౌలర్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. పవర్‌ప్లేలోనే సైమ్ అయూబ్, మహ్మద్ హారిస్‌ను పెవిలియన్ పంపి పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చారు. మొదటి 10 ఓవర్లలో భారత్ బౌలర్లు 37 డాట్ బాల్స్ వేశారు.

Related Articles

Related image1
ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన స్మృతి మంధాన-ప్రతికా రావల్
Related image2
Today Top 5 News : నేడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి
35
భారత్ బౌలర్ల దెబ్బకు 127/9 కే పరిమితమైన పాకిస్తాన్
Image Credit : Getty

భారత్ బౌలర్ల దెబ్బకు 127/9 కే పరిమితమైన పాకిస్తాన్

మిడిల్ ఓవర్లలో కూడా భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మధ్య ఓవర్లలో పాకిస్తాన్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీశారు. ఫఖర్ జమాన్ (17), కెప్టెన్ సల్మాన్ అఘా (3) త్వరగా వెనుదిరగగా, ఫర్హాన్ (40) కొంత ప్రతిఘటించినా నిలువలేకపోయాడు. కుల్దీప్ తన నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

చివరి ఓవర్లలో షాహీన్ అఫ్రిదీ, ఫహీమ్ అష్రఫ్ కొంత ప్రతిఘటించినా, భారత బౌలర్లు రాణించడంతో పెద్ద స్కోర్ చేయలేకపోయింది. వరుణ్ చక్రవర్తి, బుమ్రా కీలక వికెట్లు తీశారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 స్కోరుకే పరిమితమైంది. మొత్తం మీద కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2 వికెట్లు) భారత బౌలింగ్‌కి హైలైట్‌గా నిలిచారు. 

45
అభిషేక్ శర్మ పాకిస్తాన్ ను షేక్ చేశాడు.. బౌండరీల వర్షం
Image Credit : X/@BCCI

అభిషేక్ శర్మ పాకిస్తాన్ ను షేక్ చేశాడు.. బౌండరీల వర్షం

ఆసియా కప్ 2025లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడు బ్యాటింగ్‌తో మరోసారి మెరిశాడు. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తరఫున శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన అభిషేక్ కేవలం 13 బంతుల్లో 31 పరుగుల సునామీ నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు బౌండరీలు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. 238.46 స్ట్రైక్‌రేట్ తో ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది.

షాహీన్ అఫ్రిదీ వేసిన తొలి ఓవర్‌లోనే అభిషేక్ ఒక బౌండరీ, ఒక సిక్స్ బాదాడు. దీంతో పాకిస్తాన్ స్టార్ పేసర్‌పై ఒత్తిడి పెరిగింది. తరువాత అయూబ్ బౌలింగ్‌లో కూడా వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు వేగం పెంచాడు.

అయితే నాలుగో ఓవర్‌లో అయూబ్ వేసిన క్యారమ్ బాల్‌ను లాంగ్ ఆఫ్‌ మీదుగా కొట్టగా.. అష్రఫ్ చేతికి క్యాచ్ గా చిక్కాడు. దీంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ స్కోరు అప్పటికి 42/2గా ఉంది.

55
భారత్ కు విజయాన్ని ఖాయం చేసిన తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్
Image Credit : Twitter/BCCI

భారత్ కు విజయాన్ని ఖాయం చేసిన తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్

శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. నిలకడగా ఆడుతూ భారత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. తిలక్ వర్మ 31 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. 

కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చివరి వరకు క్రీజులో ఉండి భారత్ కు విజయాన్ని అందించాడు. సూర్య 47 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. 131-3 (15.5 Ov) స్కోర్ తో 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
ప్రపంచ రికార్డు బద్దలుకొట్టిన స్మృతి మంధాన-ప్రతికా రావల్
Recommended image2
Today Top 5 News : నేడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved