IND vs ENG : ఒకే ఒక్కడు.. భారత ప్లేయర్ గా అశ్విన్ సరికొత్త రికార్డు.. !
Ashwin records: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో 500 వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్ గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్ రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజే మరో అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ప్లేయర్ల సరసన నిలిచాడు.
Ravichandran Ashwin, Ashwin
IND vs ENG - Ravichandran Ashwin: ఇప్పటికే టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. రాంచీలో భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో ఒక వికెట్ తీసుకోవడం ద్వారా టెస్టుల్లో ప్రత్యర్థిపై 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన తొలి భారత ఆల్ రౌండర్ గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జానీ బెయిర్ స్టోను ఔట్ చేసిన తర్వాత ఆర్ అశ్విన్ ఈ ఘనత సాధించాడు. దీంతో ఎలైట్ జాబితాలో చేరడానికి అశ్విన్ కు 23 మ్యాచ్ లు పట్టాయి. ఈ మైలురాయిని చేరుకోవడానికి పట్టిన మ్యాచ్ ల సంఖ్యలో ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాపై బోథమ్ 22 మ్యాచ్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు.
Ravichandran Ashwin
ఓవరాల్ గా ప్రత్యర్థిపై 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ఏడో ఆటగాడిగా ఆర్ అశ్విన్ నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో అశ్విన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా నిలిచాడు.
Ravichandran Ashwin, Ashwin
టెస్టుల్లో అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన భారత బౌలర్ అశ్విన్ నిలిచాడు. అశ్విన్ తన 98వ టెస్టులోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ లో రెండో బౌలర్ గా ఘనత సాధించాడు.
4వ టెస్టులో అశ్విన్ మరిన్ని రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది. భారత్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లేను అధిగమించేందుకు అశ్విన్ కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. స్వదేశంలో అశ్విన్ 349 వికెట్లు పడగొట్టి టేబుల్ టాపర్ అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు. అశ్విన్ మూడో వికెట్ తీస్తే అనిల్ కుంబ్లేను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు.
Ravichandran Ashwin
స్వదేశంలో 350 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అనిల్ కుంబ్లే, ముత్తయ్య మురళీధరన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ సరసన అశ్విన్ చేరనున్నాడు.