INDvsAUS: రేపే ఆస్ట్రేలియాతో మూడో వన్డే... పరువు నిలవాలంటే ఈ మార్పులు చేయాల్సిందే...
First Published Dec 1, 2020, 10:29 AM IST
INDvsAUS: ఆస్ట్రేలియా టూర్‌లో ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ సేనకి ఏదీ కలిసి రావడం లేదు. ఆడిన రెండు వన్డేల్లోనూ పోరాడి ఓడిన టీమిండియా, 2-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. మిగిలిన చివరి వన్డే గెలవకపోతే వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది టీమిండియా. అయితే చివరి వన్డేలో గెలవాలంటే టీమిండియా కొన్ని మార్పులు చేయాల్సిందే...

సైనీ అవుట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు నవ్‌దీప్ సైనీ. రెండు మ్యాచుల్లో కలిపి వేసింది 17 ఓవర్లే అయినా 150కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. తీసింది మాత్రం ఒకే ఒక్క వికెట్. వెన్నునొప్పితో బాధపడుతున్నాడని వార్తలు వినిపించిన నవ్‌దీప్ సైనీకి ఆఖరి వన్డే మ్యాచ్‌లో విశ్రాంతి కల్పిస్తే బెటర్.

నటరాజన్‌కి చోటు: ఐపీఎల్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్, భారత జట్టుతో ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అతన్ని టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసింది బీసీసీఐ. నవ్‌దీప్ సైనీ, బుమ్రా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అతని స్థానంలో యార్కర్ కింగ్‌గా పేరొందిన నటరాజన్‌కి జట్టులో చోటు కల్పిస్తే మంచి రిజల్ట్ రాబట్టేందుకు అవకాశం ఉంటుంది..
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?