INDvsAUS 2nd ODI: కోహ్లీ సేన మళ్లీ అదే తప్పు... భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా...
INDvsAUS: మొదటి వన్డే పరాజయం తర్వాత కూడా భారత బౌలర్లలో ఏ మాత్రం మార్పు రాలేదు. సిడ్నీ క్రికెట్ మైదానంలో మరోసారి ఓపెనింగ్ జోడికి భారీ భాగస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చారు భారత బౌలర్లు. పవర్ ప్లేలో భారత బౌలర్లు తీయలేకపోవడంతో అవకాశాన్ని చక్కగా వాడుకున్న ఆసీస్ ఓపెనర్లు, మరోసారి భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్నారు.
ముఖ్యంగా మొదటి వన్డేలో ధారాళంగా పరుగులు ఇచ్చిన నవ్‌దీప్ సైనీని రెండో వన్డేలో కూడా ఓ ఆటాడుకున్నారు ఆస్ట్రేలియా ఓపెనర్లు.
మొదటి నాలుగు ఓవర్లలోనే 34 పరుగులు సమర్పించుకున్నాడు నవ్‌దీప్ సైనీ.
మెయిడిన్ ఓవర్‌తో ప్రారంభించినా జస్ప్రిత్ బుమ్రా వికెట్ మాత్రం తీయలేకపోయాడు.
యజ్వేంద్ర చాహాల్ కూడా విఫలం కావడంతో మరోసారి మొదటి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది ఆస్ట్రేలియా జట్టు.
డేవిడ్ వార్నర్ 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన స్టైల్‌కి తగ్గట్టుగా 5 ఫోర్లతో 38 పరుగులు చేసి ఆచితూచి ఆడుతున్నాడు.
మొదటి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం రావడంతో మరోసారి భారీ స్కోరు చేసేలా కనిపిస్తోంది ఆస్ట్రేలియా.
19 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 115 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్ 70 పరుగులతో, ఫించ్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత సారథి విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 250వ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ ఘనత సాధించిన 9వ భారత ప్లేయర్‌గా నిలిచాడు కోహ్లీ.