- Home
- Sports
- Cricket
- నన్ను ఎందుకు తీసేశారో ఇప్పటికీ అర్థం కాదు! బయటికి వెళ్తే జనాలు నవ్వుతారు... పృథ్వీ షా కామెంట్స్..
నన్ను ఎందుకు తీసేశారో ఇప్పటికీ అర్థం కాదు! బయటికి వెళ్తే జనాలు నవ్వుతారు... పృథ్వీ షా కామెంట్స్..
యశస్వి జైస్వాల్ కంటే ముందు టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, సెంచరీ బాదిన ప్లేయర్ పృథ్వీ షా. కెప్టెన్‌గా 2018 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన పృథ్వీ షా, టీమ్‌లోకి వచ్చినంత స్పీడ్‌గా, జట్టులో చోటు కోల్పోయాడు..

2018లో వెస్టిండీస్‌లో అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా, తొలి టెస్టులో 134 పరుగులు చేశాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లో టెస్టు సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా (18 ఏళ్ల 319 రోజులు) రికార్డు ఇంకా అలాగే ఉంది..
వెస్టిండీస్‌తో సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన పృథ్వీ షా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీకి ప్రధాన ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఆడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు పృథ్వీ షా..
అంతే ఆ తర్వాత మిగిలిన మ్యాచుల్లో అతనికి అవకాశం దక్కలేదు. ఆఖరికి బ్రిస్బేన్ టెస్టుకి ముందు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా ఇలా అరడజనుకి పైగా ప్లేయర్లు గాయపడినా పృథ్వీ షాని తిరిగి ఆడించేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు టీమిండియా..
2020లో న్యూజిలాండ్‌పై వన్డే ఆరంగ్రేటం, 2021లో శ్రీలంకపై టీ20 ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా.. రెండేళ్లుగా అంతర్జాతీయ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీ షా... వెస్టిండీస్‌తో సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కానీ ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన టీమ్‌లో కానీ చోటు దక్కించుకోలేకపోయాడు..
‘ఆస్ట్రేలియా టూర్‌లో ఒకే ఒక్క టెస్టు ఆడాను. ఆ తర్వాత మళ్లీ నన్ను ఆడించలేదు. టీమ్ నుంచి ఎందుకు తీసేశారో నిజంగా నాకు అర్థం కాలేదు. కొందరేమో ఫిట్‌నెస్ సరిగా లేదన్నారు. కానీ బెంగళూరులో నేను ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయ్యాకే కదా టీమ్‌కి ఆడాను..
prithvi shaw
కమ్‌బ్యాక్ కోసం నేనేం చేయాలో అన్నీ చేశాను. టీ20 మ్యాచ్‌లో ఆడాను. ఆ తర్వాత మళ్లీ అవకాశం దక్కలేదు. ఒక్క మ్యాచ్‌తో నా టెక్నిక్‌ని ఎలా డిసైడ్ చేస్తారు. టీమ్‌లో ప్లేస్ దక్కనందుకు చాలా నిరుత్సాహపడ్డాను. అయితే అన్నీ మరిచిపోయి కష్టపడాలని డిసైడ్ అయ్యా...
Image credit: Getty
నా చేతుల్లో లేని దానికి నేనేం చేయగలను. ఎవ్వరితోనూ ఫైట్ చేయలేనుగా.. నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ని. నా గురించి జనాలు చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. నాకు పెద్దగా స్నేహితులు లేరు.
స్నేహితులను చేసుకోవడానికి కూడా నేను పెద్దగా ఇష్టపడను. నా ఆలోచనలు ఎవ్వరితోనూ పంచుకోను. నా విషయాలు ఎవ్వరితోనైనా చెప్పాలంటే నాకు చాలా భయం. అందుకే నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు.. వాళ్లతో కూడా అన్నీ పంచుకోను..
బాధేస్తే నా రూమ్‌లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటా. బయటికి వెళితే జనాలు నవ్వుతారు, ఏడిపస్తారు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడతారు. ఎక్కడికి వెళితే ఏం చేసినా తప్పుగానే చూస్తారు. అందుకే బయటికి వెళ్లడం కూడా మానేశా. అందుకే ఒంటరితనం అలవాటు చేసుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు పృథ్వీ షా..