ఐసీసీ డికేడ్ అవార్డ్స్... టెస్టులకు విరాట్... వన్డే, టీ20లకు కెప్టెన్‌గా ధోనీ...
First Published Dec 27, 2020, 5:33 PM IST
ఐసీసీ 2011-2020 దశాబ్దానికి గాను బెస్ట్ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. అయితే ఈ మూడు ఫార్మాట్లలోనూ దశాబ్దపు బెస్ట్ ఎలెవన్ జట్లకు భారత క్రికెటర్లే కెప్టెన్లుగా ఎంపిక కావడం విశేషం. ఐసీసీ టీమ్ అవార్డుల్లో పాకిస్తాన్ ప్లేయర్లలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం విశేషం. మెన్స్ టీ20, మెన్స్ వన్డే, మెన్స్ టెస్టు జట్లను ప్రకటించిన ఐసీసీ, వుమెన్స్ టీ20, వుమెన్స్ వన్డే బెస్ట్ జట్లను ప్రకటించింది. మిగిలిన అవార్డులను రేపు ప్రకటించనున్నారు.

ఐసీసీ ప్రకటించిన బెస్ట్ ఎలెవన్ వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ‘కింగ్’ విరాట్ కోహ్లీ...

ఐసీసీ బెస్ట్ టెస్టు టీమ్ ఆఫ్ ది డికేడ్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు విరాట్ కోహ్లీ. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగర్కర టెస్టు టీమ్‌కి వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. కోహ్లీతో పాటు భారత స్పిన్నర్ అశ్విన్‌కి టెస్టు టీమ్‌లో చోటు దక్కింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?