- Home
- Sports
- Cricket
- ఒక్క రోజుకే! కేవలం ఒకే ఒక్క రోజులొ వన్డే టాప్ ర్యాంకు కోల్పోయిన పాకిస్తాన్... కివీస్ సీ టీమ్ దెబ్బకు...
ఒక్క రోజుకే! కేవలం ఒకే ఒక్క రోజులొ వన్డే టాప్ ర్యాంకు కోల్పోయిన పాకిస్తాన్... కివీస్ సీ టీమ్ దెబ్బకు...
స్టార్ ప్లేయర్లు, టాప్ టీమ్స్ అన్నీ ఐపీఎల్‌లో బిజీగా ఉంటే, ఇదే కరెక్టు టైమ్ అనుకున్న పాకిస్తాన్... న్యూజిలాండ్ సీ టీమ్‌తో సిరీస్‌లు ఆడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌కి ఎగబాకింది. అయితే ఒక్క రోజులోనే ఆ ర్యాంకు చేజారింది..

ట్రెంట్ బౌల్ట్, గ్లెన్ ఫిలిప్స్, డివాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్.. ఇలా టాప్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్‌లో ఉంటే, ఐపీఎల్‌లో అమ్ముడుపోని న్యూజిలాండ్ ప్లేయర్లు టామ్ లాథమ్, ఆడమ్ మిల్నే, ఇష్ సోదీ... పాక్‌తో సిరీస్ ఆడుతున్నారు..
స్టార్ ప్లేయర్లు లేని న్యూజిలాండ్ చేతుల్లో టీ20 సిరీస్‌ని 2-2 తేడాతో డ్రా చేసుకున్న పాకిస్తాన్, వన్డేల్లో వరుసగా నాలుగు విజయాలు అందుకుని సిరీస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి వన్డేల్లో నెం.1 టీమ్‌గా అవతరించింది..
అయితే పాకిస్తాన్ నెం.1 వన్డే ర్యాంకు ముచ్చట ఒక్క రోజు కూడా నిలవలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో పాకిస్తాన్ 47 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో పాకిస్తాన్ మళ్లీ టాప్ 3లోకి పడిపోయింది..
PAK vs NZ
ఆస్ట్రేలియా వన్డేల్లో 113 పాయింట్లతో టాప్ టీమ్‌గా కొనసాగుతుంటే, సరిగ్గా అనే పాయింట్లు ఉన్న టీమిండియా రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 112 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది..
pakistan
ఈ సిరీస్‌లో 272 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, వన్డేల్లో నెం.1 బ్యాటర్ ర్యాంకును కాపాడుకుంటే ఈ సిరీస్‌లో 5 మ్యాచుల్లో 363 పరుగులు చేసిన ఫకార్ జమాన్, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 2లోకి దూసుకొచ్చాడు...