మొదటి మ్యాచ్ కంటే మెరుగ్గా ఓడాం కదా... సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్ నుంచి మ్యాచ్ మ్యాచ్‌కీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్ఫామెన్స్ దిగజారుతూనే ఉంది. గత సీజన్‌లో మూడంటే మూడు మ్యాచుల్లో గెలిచి, ఆఖరి స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ, ఈ సీజన్‌ని వరుసగా రెండు పరాజయాలతో ప్రారంభించింది...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చేతులు ఎత్తేసింది...
క్వింటన్ డి కాక్, ఇవిన్ లూయిస్, జాసన్ హోల్డర్ వంటి డేంజరస్ బ్యాటర్లను కట్టడి చేసి, లక్నోను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చారు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు...
భువనేశ్వర్ కుమార్ వికెట్ తీయకపోయినా 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే సమర్పించగా వాషింగ్టన్ సుందర్ 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. టి నటరాజన్ 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు...
‘భువీ, నట్టూ ఫుల్ ఫిట్‌నెస్‌తో ట్రాక్ లోకి వచ్చేశారు. ఈ మ్యాచ్‌లో వారి ఒరిజినల్ ఆట కనిపించింది. వాళ్లిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు...
బౌలర్ల కారణంగా లక్నో సూపర్ జెయింట్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేయగలిగాం. కానీ విజయానికి కావాల్సిన ఫినిష్ రాలేదు... కానీ ఒకటి గత మ్యాచ్ కంటే మెరుగ్గా ఓడాం...
మొదటి మ్యాచ్‌తో పోలిస్తే మా ఆటతీరు చాలా మెరుగైంది. ఇప్పటిదాకా రెండు మ్యాచులు మాత్రమే అయ్యాయి. ఇద్దరు సెటిలైన బ్యాటర్లు క్రీజులో ఉండి, చేయాల్సిన పరుగులు ఓవర్‌కి 10 కంటే ఎక్కువగా ఉంటే... ఆ పరిస్థితిని ఫేస్ చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది...
అందుకే బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పలేను, బాగానే ఆడాం, కానీ గెలవలేకపోయాం. మేం విజయం అంచుల దాకా వచ్చిన విషయాన్ని మరువకూడదు...’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ...
గత సీజన్‌కి ముందు వరకూ వరుస విజయాలతో స్ట్రాంగ్ టీమ్‌గా ఉన్న సన్‌రైజర్స్, టీమ్ మేనేజ్‌మెంట్ రాజకీయాల వల్లే ఇలా తయారయ్యిందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు..
ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓడిన తర్వాత కూడా మేం బాగానే ఆడామని టామ్ మూడీ కామెంట్ చేయడంతో ఫ్యాన్స్, మరింతగా ట్రోల్స్ చేస్తున్నారు.