- Home
- Sports
- Cricket
- ఎప్పుడో క్రికెట్ చూడడం మానేశా! నాకు యజ్వేంద్ర చాహాల్ ఎవరో కూడా తెలీదు... ధనశ్రీ వర్మ షాకింగ్ కామెంట్స్..
ఎప్పుడో క్రికెట్ చూడడం మానేశా! నాకు యజ్వేంద్ర చాహాల్ ఎవరో కూడా తెలీదు... ధనశ్రీ వర్మ షాకింగ్ కామెంట్స్..
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వారి అభిమానులు. భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ, ఈ మధ్య కాలంలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి..

గాయంతో ఆటకు దూరమైన శ్రేయాస్ అయ్యర్, ధనశ్రీ వర్మతో కలిసి కొన్ని ఫంక్షన్‌లకి హాజరయ్యాడు. ఈ ఫంక్షన్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ వార్తలు వచ్చాయి..
Image credit: Yuzvendra Chahal/Instagram
ఈ వార్తలతో చాహాల్ కాపురంలో చిచ్చు రేగిందని, వీళ్లు విడిపోబోతున్నారని కూడా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తన భర్త యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి ఓ టాక్ షోకి హాజరైంది ధనశ్రీ వర్మ..
Image credit: Yuzvendra Chahal/Instagram
‘నేను ధనశ్రీ వర్మ టిక్ టాక్ వీడియోలు, ఎన్నో రీల్స్ చూశాను. లాక్‌డౌన్‌లో ఏం చేయాలో తెలియక ఆమె దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందని అడిగాను. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని ఉండేది. ఆమెకు మెసేజ్ చేయగానే ఆన్‌లైన్ క్లాసులు మొదలు పెట్టేసింది..
Image credit: Yuzvendra Chahal/Instagram
మొదటి రెండు నెలలు, డ్యాన్స్ గురించి తప్ప వేరే విషయాల గురించి మాట్లాడుకోలేదు. నేను తనను ఫ్లర్ట్ చేయలేదు. మేం స్నేహితులం కూడా కాదు. కాబట్టి డ్యాన్స్ నేర్చుకోవడంపైనే సీరియస్‌గా ఫోకస్ పెట్టాను...
Image credit: Dhanashree Verma/Instagram
లాక్‌డౌన్ టైమ్‌లో కూడా ఆమె ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండడాన్ని చూసి షాక్ అయ్యా. అదే విషయం గురించి అడిగా. అప్పటి నుంచి మా మధ్య వేరే విషయాలు వచ్చాయి. ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడం మొదలెట్టాం. ఆమె ఎవరి సాయం లేకుండా ఈ పొజిషన్‌కి వచ్చింది..
Image credit: Dhanashree Verma/Instagram
నేను, మా అమ్మకు తన గురించి చెప్పా. ఆ అమ్మాయి అంటే ఇష్టమని చెప్పా. ఆ తర్వాత ధనశ్రీకి కూడా చెప్పాను. నేను నీతో డేట్ చేయాలని అనుకోవడం లేదు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని.. ఆ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకుంది కాదు. తన గురించి పూర్తిగా తెలుసుకున్నాకే తనే కరెక్ట్ అని అనిపించింది...’ అంటూ చెప్పుకొచ్చాడు యజ్వేంద్ర చాహాల్..
Dhanashree Verma
‘నేను చాలా ఏళ్లుగా క్రికెట్ చూస్తుండేదాన్ని. కానీ సరిగ్గా చాహాల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే నేను క్రికెట్ చూడడం ఆపేశా. అందుకే మా ఇద్దరి మధ్య పరిచయం ఇంత దూరం వచ్చిందేమో. డ్యాన్స్ క్లాసులు కావాలని ఇతను మెసేజ్ చేసినప్పుడు, యజ్వేంద్ర చాహాల్ ఎవరో కూడా నాకు తెలీదు..
డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు, సీరియస్‌గా నేర్చుకున్నాడు కూడా. అతని కమిట్‌మెంట్ నాకెంతో నచ్చింది. హోమ్‌వర్క్ ఇచ్చినప్పుడు సీరియస్‌గా చేసేవాడు. డ్యాన్స్ వీడియోలు పంపించి, ఎలా ఉందని అడిగేవాడు. ఓ స్టూడెంట్‌గా, ఓ స్నేహితుడిగా అతన్ని ఎంతో ఇష్టపడ్డా..
నేరుగా పెళ్లి చేసుకుంటానని అడగడంతో పడిపోయా.. ఇప్పుడున్న తరంలో ఎవ్వరూ అలా అడగరు. పెళ్లి గురించి అతను ఎలాంటి ఒత్తిడి చేయలేదు. మా జీవితం చాలా చక్కగా సాగుతోంది. అందరూ అనుకుంటున్నట్టు ఎలాంటి సమస్యలు లేవు...’ అంటూ చెప్పుకొచ్చింది ధనశ్రీ వర్మ..