- Home
- Sports
- Cricket
- నా కెరీర్ ఇలా అవ్వడానికి కారణం వాళ్లే, లేదంటే కనీసం 150 మ్యాచులు ఆడేవాడిని... రాబిన్ ఊతప్ప కామెంట్...
నా కెరీర్ ఇలా అవ్వడానికి కారణం వాళ్లే, లేదంటే కనీసం 150 మ్యాచులు ఆడేవాడిని... రాబిన్ ఊతప్ప కామెంట్...
రాబిన్ ఊతప్ప... టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తూనే అదరగొట్టిన బ్యాట్స్‌మెన్. 2006, ఏప్రిల్ 15న ఇంగ్లాండ్‌పై ఎంట్రీ ఇచ్చిన రాబిన్ ఊతప్ప, తన కెరీర్‌లో 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు. అయితే తన కెరీర్ ఇలా నాశనం అవ్వడానికి కారణం టీమిండియా తనపట్ల అనుసరించిన విధానమే అంటున్నాడు ఊతప్ప..

2006లో ఇండోర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగాడు కర్ణాటక యంగ్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప. 288 పరుగుల లక్ష్యచేధనలో 96 బంతుల్లో 86 పరుగులు చేసి అదరగొట్టాడు. అప్పటికే ఓ భారత ప్లేయర్‌కి ఆరంగ్రేట మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు...

‘నా అంతర్జాతీయ కెరీర్ ఆశించినంత సక్సెస్‌ఫుల్‌గా మాత్రం సాగలేదు. నా గణాంకాలను చూస్తే... నేను ఆడిన మ్యాచులు తక్కువే అయినా చాలా బ్యాటింగ్ పొజిషన్లలో ఆడాను....

ప్రతీ మూడు మ్యాచులకు ఒకసారి నా బ్యాటింగ్ పొజిషన్ మారుస్తూ ఉండేవాళ్లు. అసలు కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. ఒకే బ్యాటింగ్ పొజిషన్‌లో 49 మ్యాచులు ఆడి ఉంటే... నేను కనీసం 149, లేదా 249 మ్యాచులు ఆడేవాడిని...

ఏ బ్యాట్స్‌మెన్‌కి అయినా బ్యాటింగ్ పొజిషన్ మారుస్తూ ఉంటే, రాణించడం కష్టం అవుతుంది. ఓపెనర్‌గా మొదటి మ్యాచ్‌లోనే రాణించినప్పుడు, అదే పొజిషన్‌లో కొనసాగించి ఉండవచ్చు. లేదా వేరే పొజిషన్‌లో కొన్ని చాన్సులు ఇచ్చి చూడొచ్చు...

ఆ సమయంలో నా జట్టుకి ఇది చాలా ఉపయోగపడింది. జట్టు అవసరాల కోసం నన్ను రకరకాల పొజిషన్లలో బ్యాటింగ్‌కి దింపేవాళ్లు, ఫలితంగా టీమ్‌కి మంచి జరిగింది. కానీ నా కెరీర్‌ను దెబ్బతీసింది... ’ అంటూ కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప.

2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రాబిన్ ఊతప్ప, ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ గెలిచిన టీమ్‌లోనూ ఉన్నాడు. ఓపెనర్‌గా 16 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, వన్‌డౌన్ నుంచి ఏడో స్థానం వరకూ బ్యాటింగ్ చేశాడు.

వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఏడుసార్లు, ఐదో స్థానంలో ఐదు సార్లు, ఆరో స్థానంలో ఆరు సార్లు, ఏడో స్థానంలో 8 సార్లు బ్యాటింగ్ చేసిన రాబిన్ ఊతప్ప... 2006 నుంచి 2015 వరకూ భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు.

13 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున మంచి గణాంకాలు నమోదుచేసిన రాబిన్ ఊతప్ప... చివరసారిగా 2015లో జింబాబ్వేపై చివరి వన్డే, టీ20 మ్యాచ్ ఆడాడు.