MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటే, బిల్లు కట్టడానికే... స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్ కామెంట్స్...

ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటే, బిల్లు కట్టడానికే... స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్ కామెంట్స్...

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కి దూరమయ్యాడు శ్రీశాంత్... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్న శ్రీశాంత్‌, ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్ట్ కావడం... భారత క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది...

Chinthakindhi Ramu | Published : Sep 28 2021, 09:09 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

టీమిండియాలోకి వస్తూనే మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్ శ్రీశాంత్... సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో సిక్సర్ కొట్టిన తర్వాత బౌలర్ ఆండ్రే నెల్ ముందుకెళ్లి డ్యాన్స్ చేయడం వంటవి శ్రీశాంత్ యాటిట్యూడ్‌కి పర్ఫెక్ట్ ఉదాహరణ..

210
Asianet Image

ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్ చేతుల్లో చెంపదెబ్బ తిన్న తర్వాత గుక్కపెట్టి ఏడ్చిన శ్రీశాంత్, వికెట్ తీసిన తర్వాత చేసుకునే క్రేజీ సెలబ్రేషన్స్‌తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...

310
Asianet Image

టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడిన శ్రీశాంత్, ఓవరాల్‌గా 169 వికెట్లు పడగొట్టాడు... కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో స్పాట్ ఫిక్సింగ్ వివాదం, అతని కెరీర్‌ను నాశనం చేసింది...

410
Asianet Image

2013 ఐపీఎల్ సీజన్ మధ్యలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టు అయ్యి, ఏడేళ్ల పాటు నిషేధానికి గురైన కేరళ క్రికెటర్ శ్రీశాంత్, 2020 సెప్టెంబర్‌లో బ్యాన్ కాలాన్ని పూర్తిచేసుకుని... దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు..

510
Asianet Image

‘స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నేను అవుటైన సమయంలో అప్పటికే ఇరానీ ట్రోఫీ ఆడి, దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా... అయితే ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది...

610
Asianet Image

నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటే, రూ.2 లక్షల బిల్లు అవుతుంది. అలాంటప్పుడు కేవలం రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్ చేసి, నా జీవితాన్ని నాశనం చేసుకుంటానా?

710
Asianet Image

నా కాలికి 12 సర్జరీలు అయిన తర్వాత కూడా 130 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశా... క్రికెట్ అంటే నాకున్న ప్రేమ, అంకితభావం అలాంటిది. క్రికెట్ కోసం నా శరీరాన్ని కూడా లెక్కచేయలేదు...

810
Asianet Image

ఐపీఎల్‌లో నేను స్పాట్ ఫిక్సింగ్ చేశానంటున్న మ్యాచ్‌లో నేను వేసిన స్పెల్ చూస్తే, నా పర్పామెన్స్ ఎలా ఉందో అర్థమవుతుంది... అయినా నన్ను ఈ స్కాండిల్‌లో ఇరికించారు... ’ అంటూ కామెంట్ చేశాడు శ్రీశాంత్...

910
Asianet Image

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ ఛావన్ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు అనుమానించిన పోలీసులు, ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు...

1010
Asianet Image

ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్ వేసే సమయంలో తన కర్ఛీఫ్‌ను వెనకాల కాకుండా ముందు పెట్టుకొని బౌలింగ్ చేయడం, స్పాట్ ఫిక్సర్లకు హింట్ ఇవ్వడానికేనని ఆరోపణలు వచ్చాయి...

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories