అలా చేయకుండా ఉండాల్సింది! ఏదో ఆ క్షణంలో ఆవేశంలో... ఆవేశ్ ఖాన్ కామెంట్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రెండు మ్యాచుల్లో కూడా హై డ్రామా నడిచింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో లక్నో గెలిస్తే, లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచింది...

Faf du Plessis and Avesh Khan
ఏప్రిల్ 10న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది లక్నో సూపర్ జెయింట్స్.. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతిని ఆవేశ్ ఖాన్ ఎదుర్కొన్నాడు..
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చివరి బంతిని ఫేస్ చేసిన ఆవేశ్ ఖాన్, బ్యాటుకి బంతి తగిలించకలేకపోయినా సింగిల్ తీసి, బైస్ రూపంలో ఒక్క పరుగు సాధించాడు. ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బంతి అందుకోలేక తడబడి, వికెట్లను, మ్యాచ్‌నీ మిస్ చేశాడు...
Image credit: PTI
సింగిల్ తీసిన ఆవేశ్ ఖాన్, నాన్ స్టైయికింగ్ ఎండ్‌కి లగెత్తుకుని వెళ్లిన తర్వాత హెల్మెట్ తీసి, నేలకేసి కొట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు. లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్, బెంగళూరు ఫ్యాన్స్‌వైపు ‘సైలెంట్’గా ఉంటాలంటూ నోటి మీద వెలేసుకుని సిగ్నల్ ఇచ్చాడు..
విరాట్ కోహ్లీకి విపరీతమైన కోపం తెప్పించాయి ఈ రెండు సంఘటనలు. ఓ రకంగా విరాట్ కోహ్లీ, లక్నోలో నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్‌లతో గొడవపడడానికి ఆవేశ్ ఖాన్ ఆవేశమే కారణం... హెల్మెట్ నేలకేసి బాదినందుకు ఆవేశ్ ఖాన్‌కి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా కూడా పడింది. తాజాగా ఈ సంఘటనపై స్పందించాడు ఆవేశ్ ఖాన్..
‘ఆ రోజు హెల్మెట్ తీసి బాదడం కాస్త ఓవరే. అలా చేయకుండా ఉండాల్సింది. అయితే అప్పుడు మ్యాచ్ ఉన్న పరిస్థితులో తీవ్రమైన ప్రెషర్‌లోకి వెళ్లాను. అందుకే గెలవగానే ఒళ్లు తెలియకుండా అలా చేసేశాను..
ఇప్పుడు అది తలుచుకుంటే సిగ్గేస్తుంది. ఆ రోజు అలా చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. ఆ సంఘటన తర్వాత నన్ను సోషల్ మీడియాలో ఆడుకున్నారు. ఇప్పటికీ ఆడుకుంటున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత బౌలర్ ఆవేశ్ ఖాన్...