ఐపీఎల్‌లో ఫారిన్ కోచ్‌లు ఉండడమే టీమిండియా దరిద్రం... సునీల్ గవాస్కర్ కామెంట్...
ఐపీఎల్‌లో కానీ, భారత క్రికెట్ జట్టు విషయంలో కానీ స్వదేశీ హెడ్ కోచ్‌లను వాడిన దాని కంటే ఈ మధ్యకాలంలో విదేశీ కోచ్‌లను వాడిందే ఎక్కువే. జాన్ రైట్ నుంచి గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్‌స్టన్, డంకెన్ ఫ్లెట్చర్ వంటి ఫారిన్ ప్లేయర్లు, హెడ్ కోచ్‌లుగా వ్యవహరించారు... ఐపీఎల్‌లో అయితే ఫారిన్ కోచ్‌ల సంఖ్యకి లెక్కేలేదు...

ఐపీఎల్‌లో షేన్ వార్న్ దగ్గర్నుంచి రికీ పాంటింగ్, గ్యారీ కిర్‌స్టన్, మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, స్టీఫెన్ ఫ్లెమ్మింగ్... ఇలా మెజారిటీ టీమ్స్‌కి ఫారిన్ మాజీ ప్లేయర్లే హెడ్ కోచ్‌లుగా ఉన్నారు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్... హెడ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. కేకేఆర్ టీమ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వీక్‌నెస్‌లను దగ్గరగా పరీక్షించి, గమనించిన మెక్‌కల్లమ్... ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో దొంగ దెబ్బ తీశాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లను, స్పిన్ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటున్న శ్రేయాస్ అయ్యర్‌ను అవుట్ చేసేందుకు షార్ట్ బాల్స్ వేయాల్సిందిగా డగౌట్ నుంచి సైగలతో సూచించాడు బ్రెండన్ మెక్‌కల్లమ్...
Stephen Fleming
తాజాగా ఈ సంఘటనపై స్పందించాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. ‘ఐపీఎల్‌లో ఫారిన్ కోచ్‌ల అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. చాలామంది విదేశీ ప్లేయర్లు, ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌ల వచ్చిన తర్వాత భారత ప్లేయర్ల వీక్‌నెస్ వెతకడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు..
భారత క్రికెట్ జట్టుకి పట్టిన దరిద్రం ఇదే. ఇలాంటి ఫారిన్ హెడ్ కోచ్‌లు, తిరిగి తమ దేశాలకు వెళ్లినప్పుడు భారత ప్లేయర్ల సీక్రెట్స్ బయటపెడుతున్నారు. హెడ్ కోచ్‌లు మాత్రమే కాదు, అసిస్టెంట్ కోచ్‌లు, బ్యాటింగ్ కన్సల్టెంట్స్, బౌలింగ్ కన్సల్టెంట్స్ కూడా ఇదే పని చేస్తున్నారు...
Sunil Gavaskar
ఐపీఎల్‌లో ఫారిన్ కోచ్‌ల సంఖ్య తగ్గిస్తే భారత జట్టు బాగుపడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
ఐపీఎల్‌లో సీఎస్‌కేకి హెడ్ కోచ్‌గా వ్యవహరించే న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ముందు జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని కొనుగోలు చేసేలా చేశాడు..
ఐపీఎల్ సమయంలో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడే పూజారా, ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడకుండా ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేసిన స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, ఐపీఎల్ సమయంలో అతని టెక్నిక్‌లను కూడా బాగా గమనించి... కివీస్ టీమ్‌కి చేరవేసినట్టు వార్తలు వచ్చాయి...