- Home
- Sports
- Cricket
- ఆ నలుగురే బెస్ట్, హర్షల్ గిబ్స్ కామెంట్... జో రూట్, కేన్ విలియంసన్‌లకు దక్కని చోటు...
ఆ నలుగురే బెస్ట్, హర్షల్ గిబ్స్ కామెంట్... జో రూట్, కేన్ విలియంసన్‌లకు దక్కని చోటు...
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, కోచ్ హర్షల్ గిబ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 2008 అండర్19 వరల్డ్‌కప్ సమయంలో భారత సారథి విరాట్ కోహ్లీ కూడా తన ఫేవరెట్ క్రికెటర్‌గా గిబ్స్ పేరునే చెప్పాడు. తాజాగా హర్షల్ గిబ్స్, ప్రస్తుత తరంలో నలుగురు బెస్ట్ బ్యాట్స్‌మెన్ల గురించి చెప్పుకొచ్చాడు...

‘ప్రస్తుతతరంలో ది బెస్ట్ బ్యాట్స్‌మెన్లంటే... విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్, జోస్ బట్లర్... ఈ ముగ్గురికీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. కొందరు వెస్టిండీస్ ప్లేయర్లు కూడా బాగా ఆడతారు...
టాపార్డర్ బ్యాట్స్‌మెన్, పవర్ హిట్టర్లు, ఫినిషర్లు... ఇలా ఒక్కో ప్లేస్‌లో ఒక్కో ప్లేయర్ బాగా ఆడతారు. అన్నింటినీ కలిపి చూస్తే... విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్, స్టీవ్ స్మిత్... ఫార్మాట్లతో సంబంధం లేకుండా అదరగొడుతున్నారు...
అవును... ఏబీ డివిల్లియర్స్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. లేదంటే అతను కూడా ఈ లిస్టులో ఉండేవాడు. టాలెంట్ ఉన్న ప్లేయర్ల పేర్లు చెప్పాలంటే ఓ 10 మంది దాకా ఉండొచ్చు...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్షల్ గిబ్స్...
హర్షల్ గిబ్స్ ప్రకటించిన నలుగురిలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ లేకపోవడంపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి... జో రూట్ టెస్టుల్లో ఎక్కువగా రాణిస్తుండడంతో అతన్ని లిస్టులో చేర్చలేదని అనుకుంటే, స్టీవ్ స్మిత్ కూడా ఆ కోవకు చెందినవాడే...
అలాగే మూడు ఫార్మాట్లలోనూ అదరగొడుతున్నవారిలో కేన్ విలియంసన్ కూడా ఒకడు. విరాట్ కోహ్లీ తర్వాత కేన్ విలియంసన్ పేరు ఉండాల్సిందేనని అంటున్నారు కేన్ మామ ఫ్యాన్స్...
అలాగే టీ20 వరల్డ్‌కప్ గెలవగలిగే మూడు జట్ల పేర్లను కూడా కామెంట్ చేశాడు హర్షల్ గిబ్స్... ‘నా ఉద్దేశంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లను టీ20 వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్స్... కానీ చెప్పలేం శ్రీలంక లేదా బంగ్లాదేశ్ కూడా వరల్డ్‌కప్ గెలిచినా గెలవచ్చు...
అయితే ఇప్పటికైతే పాకిస్తాన్, ఇండియా, ఇంగ్లాండ్ జట్లు మాత్రమే ఫెవరెట్లుగా కనిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను బట్టి విజేతలు ఎవరనేది తేలుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం. ఇండియా, ఇంగ్లాండ్ జట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి..’ అంటూ కామెంట్ చేశాడు హర్షల్ గిబ్స్...