అక్కడ రూ.30 లక్షలు, ఐపీఎల్‌లో రూ.13 కోట్లు... హారీ బ్రూక్ సక్సెస్ క్రెడిట్ కావాలంటూ...
ఐపీఎల్ 2023 మినీ వేలంలో హారీ బ్రూక్‌కి రూ.13.25 కోట్ల భారీ ధర దక్కింది. 23 ఏళ్ల బ్యాటర్ కోసం భారీ ధర చెల్లించేందుకు సిద్ధమైంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ మినీ వేలానికి ముందు సరిగ్గా 20 టీ20 మ్యాచులు ఆడి ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన హారీ బ్రూక్‌కి ఇంత ధర దక్కడానికి కారణమేంటి?
ఐపీఎల్‌లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వివిధ ఫ్రాంఛైజీ లీగుల్లో పాల్గొని సత్తా చాటాడు హారీ బ్రూక్. టీ20 బ్లాస్ట్‌లోయార్క్‌షైర్ తరుపున ఆడిన హారీ బ్రూక్, ‘ది హండ్రెడ్’ లీగ్‌లో నాథరన్ సూపర్‌ఛార్జర్స్ తరుపున ఆడాడు. పాక్ సూపర్ లీగ్ 2022లో సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు హారీ బ్రూక్...
లహోర్ ఖలందర్స్ టీమ్ తరుపున ఆడిన హారీ బ్రూక్, ఇస్లామాబాద్ యునైటెడ్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 102 పరుగులు చేశాడు. హరీ బ్రూక్ క్రీజులోకి రావడానికి ముందు 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లాహోర్ ఖలందర్స్, 197 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది...
పాక్ సూపర్ లీగ్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హారీ బ్రూక్..
ఈ ఇన్నింగ్స్‌తో హారీ బ్రూక్ జీవితం మారిపోయింది. సౌతాఫ్రికా20 లీగ్‌లో జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్, హారీ బ్రూక్‌ని 2.3 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో బంపర్ ప్రైజ్ (రూ.13.25 కోట్లు) దక్కింది...
Harry Brook
పాక్ సూపర్ లీగ్‌లో రూ.30.50 లక్షలు తీసుకున్న హారీ బ్రూక్, ఇప్పుడు దానికి 40 రెట్లు అధికంగా ఐపీఎల్ ద్వారా అందుకోబోతున్నాడు. హారీ బ్రూక్ సక్సెస్‌కి పీఎస్‌ఎల్ కారణమని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు...
Harry Brook-Sam Curran
అయితే ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు హారీ బ్రూక్‌కి ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో మొత్తం పాక్ సూపర్ లీగ్‌నే కొనేయగలడని ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడిన అనుభవంతో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3 సెంచరీలు చేసి అదరగొట్టాడు హారీ బ్రూక్. అయితే ఇండియాలో పిచ్‌లపై హారీ బ్రూక్ ఇంత వరకూ సక్సెస్ అవుతాడు? సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఎంత ఉపయోగపడతాడనేది ఆసక్తికరంగా మారింది..