- Home
- Sports
- Cricket
- టీమ్‌కి అతని అవసరం చాలా ఉంది! హార్ధిక్ పాండ్యాకి కూడా ఆ విషయం తెలుసు... - సౌరవ్ గంగూలీ...
టీమ్‌కి అతని అవసరం చాలా ఉంది! హార్ధిక్ పాండ్యాకి కూడా ఆ విషయం తెలుసు... - సౌరవ్ గంగూలీ...
పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లు, టీమిండియాలో చోటు ఎప్పుడు దొరుకుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం టెస్టు టీమ్‌లో చోటు ఇస్తాం రమ్మంటే వద్దంటున్నాడు... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయంపై కామెంట్ చేశాడు..

Hardik Pandya Test
‘టెస్టులు ఆడేందుకు నాకు అర్హత లేదు. నేను టెస్టులు ఆడేందుకు కావాల్సిన అర్హత సాధించినప్పుడు కచ్చితంగా ఆడతాను. ఇప్పుడు 10 శాతం కాదు కదా కనీసం 1 శాతం కూడా టెస్టు టీమ్‌లో ఉండేందుకు నాకు అర్హత లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...
Image credit: PTI
‘టీ20ల్లో కొందరు స్పెషలిస్ట్ ప్లేయర్లు ఉంటారు. వాళ్లు టెస్టుల్లో ఆడలేరు. అయితే హార్ధిక్ పాండ్యా అలా కాదు. హార్ధిక్ పాండ్యా టెస్టుల్లో మ్యాచ్ విన్నర్... టెస్టులని కాదు, ప్రతీ ఫార్మాట్‌లోనూ హార్ధిక్ పాండ్యా స్పెషల్ ప్లేయరే... ఎందుకంటే అతను వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్...
Image credit: PTI
ప్లేయర్ల ఆటను డబ్బు ప్రభావితం చేయదు. ఆట ద్వారా డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడం కోసమే ఆట ఆడితే సక్సెస్ రాదు.. అందుకే మెజారిటీ ప్లేయర్లు, మూడు ఫార్మాట్లు ఆడాలని నేను కోరుకుంటున్నా.. కుర్రాళ్లలో ఆడాలనే ఆత్రం, తపన చూస్తుంటే ముచ్ఛట వేస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..
Steve Smith-Hardik Pandya
గత ఏడాది బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి క్రికెట్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడు. 2020 సీజన్‌లో ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి అప్పట్లో బహిరంగంగానే సపోర్ట్ చేశాడు గంగూలీ...
Hardik Pandya
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్, టైటిల్ విజేతగా నిలిచింది. కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా, టీమిండియాకి టీ20 కెప్టెన్‌గా మారాడు. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత హార్ధిక్ పాండ్యాకి వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా దక్కబోతున్నట్టు సమాచారం..