- Home
- Sports
- Cricket
- ఆ మ్యాచ్‌లోనే నా కెరీర్ అయిపోయిందనుకున్నా, అప్పుడే ధోనీ వచ్చాడు.. - హార్ధిక్ పాండ్యా...
ఆ మ్యాచ్‌లోనే నా కెరీర్ అయిపోయిందనుకున్నా, అప్పుడే ధోనీ వచ్చాడు.. - హార్ధిక్ పాండ్యా...
భారత జట్టులో పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు హార్ధిక్ పాండ్యా. 27 ఏళ్ల ఈ యంగ్ ఆల్‌రౌండర్, వెన్నెముక సర్జరీ తర్వాత బాల్‌తో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోతున్నా, బ్యాటుతో మాత్రం అదరగొడుతున్నాడు... హార్ధిక్ పాండ్యాకి ధోనీతో మంచి అనుబంధం ఉంది.

2016లో ఆస్ట్రేలియాపై టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో, శ్రీలంకతో మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అదరగొట్టి, భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా... తొలి మ్యాచ్‌లో తాను వేసిన మొదటి ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు తీసుకున్నాడు.

మొదటి మూడు బంతులు వరుసగా వైడ్లుగా వెళ్లగా, ఆ తర్వాత బంతి స్టీవ్ స్మిత్‌కి తగిలింది. మూడో బంతికి ఆరోన్ ఫించ్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత మళ్లీ రెండు వైడ్లు. ఆఖరి బంతికి స్మిత్ ఫోర్ బాదడంతో తొలి ఓవర్‌లోనే 19 పరుగులిచ్చాడు పాండ్యా.

ఆరంగ్రేటం మ్యాచ్, అందులోనూ మొదటి ఓవర్‌లోనే ఐదు వైడ్లు వేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైన హార్ధిక్ పాండ్యా, ఇక తన కెరీర్ ముగిసిపోయినట్టే అనుకున్నాడట.

‘నేను వేసిన మొదటి ఓవర్‌లోనే ఐదు వైడ్లు వేశాను. ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు తీసుకున్న నాకు మళ్లీ ఓవర్ వస్తుందని అనుకోలేదు. అయితే ధోనీ, కోహ్లీ నాపై భరోసా ఉంచారు.

నేను చేస్తున్న తప్పును గమనించిన ధోనీ, నా దగ్గరికి వచ్చి ‘నువ్వు లెగ్‌ను టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తున్నాం, అలా కాకుండా వికెట్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ వేయమని చెప్పాడు.... నేను ధోనీ సలహాలను ఫాలో అయ్యా. వికెట్లు వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా.

మొదటి మ్యాచ్‌లో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు హార్ధిక్ పాండ్యా. పాండ్యా వేసిన రెండో ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు.

టీమిండియా తరుపున 11 టెస్టులు ఆడిన హార్ధిక్ పాండ్యా, ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 532 పరుగులు చేశాడు, 17 వికెట్లు తీశాడు. అయితే హార్ధిక్ పాండ్యా వెన్నుగాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతన్ని ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపిక చేయలేదు బీసీసీఐ.

60 వన్డేల్లో 55 వికెట్లతో 1267 పరుగులు, 48 టీ20ల్లో 474 పరుగులతో పాటు 41 వికెట్లు పడగొట్టిన హార్ధిక్ పాండ్యా, శ్రీలంకతో జరిగే టీ20, వన్డే జట్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.