- Home
- Sports
- Cricket
- కరెక్టుగా ఆడితే హార్ధిక్ పాండ్యా, కపిల్ దేవ్ రికార్డులు కొడతాడు... భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
కరెక్టుగా ఆడితే హార్ధిక్ పాండ్యా, కపిల్ దేవ్ రికార్డులు కొడతాడు... భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
గ్యాప్ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... అదిరిపోయే పర్ఫామెన్స్‌లతో దూసుకుపోతున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో, వన్డే సిరీస్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా, ఇంగ్లాండ్‌పై 4 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో హార్ధిక్ పాండ్యాకి ఇదే మొట్టమొదటి నాలుగు వికెట్ల ప్రదర్శన... 7 ఓవర్లలో 3 మెయిడిన్లు వేసి సంచలన పర్ఫామెన్స్ ఇచ్చాడు హార్ధిక్...
లక్ష్యఛేదనలో 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటుతోనూ ఆదుకున్నాడు హార్దిక్ పాండ్యా. రిషబ్ పంత్‌తో కలిసి ఐదో వికెట్‌కి 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హార్ధిక్ పాండ్యా... 55 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేశాడు...
బ్యాటుతో 100 పరుగులు, బౌలింగ్‌లో 6 వికెట్లు పడగొట్టి మూడు వన్డేల సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకున్నాడు హార్ధిక్ పాండ్యా...
‘హార్ధిక పాండ్యాకి కపిల్ దేవ్ రికార్డులు బ్రేక్ చేయగల సత్తా ఉంది. కపిల్ దేవ్ చాలా గొప్ప ఆల్‌రౌండర్. ఇప్పుడు కపిల్ దేవ్ రికార్డులను హార్ధక్ పాండ్యా కొట్టేస్తాడని అనడం కాస్త కష్టమే...
Image credit: Getty
అయితే అతను ఇలాంటి బౌలింగ్ పర్పామెన్స్ కొనసాగిస్తే... బ్యాటింగ్ ఎలాగూ అదరగొట్టగలడు. మరో 5-7 ఏళ్లు ఆడితే కపిల్ దేవ్ రికార్డులకు దగ్గరగా రాగలుగుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
తన వన్డే కెరీర్‌లో 225 మ్యాచులు ఆడిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, 253 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటుతోనూ రాణించి 3783 పరుగులు చేశాడు. 1983 వన్డే వరల్డ్ కప్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...