హార్దిక్ పాండ్యా తన విడాకులతో నటాషాకు తన ఆస్తిలో ఎంత వాటా ఇచ్చాడు?
Hardik Pandya's assets : భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా - సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ లు విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. విడాకుల భరణం హాట్ టాపిక్ అవుతోంది.
Hardik Pandya, Natasa Stankovic
Hardik Pandya-Natasa divorce's alimony : టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకున్నాడు. తమ నాలుగు సంవత్సరాల బంధాన్ని తెంచుకున్నాడు. పరస్పర అంగీకారంతో తాము విడాకులు తీసుకున్నట్లు క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
విడాకుల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా నికర విలువ, ఆస్తులు, జీతం గురించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. భారత జట్టు ఆల్ రౌండర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ ఆల్-రౌండర్లలో ఒకరు. భారత జట్టు కోసం అద్భుతమైన ఆటతో రాణించిన అతికొద్ది మంది క్రికెటర్లలో ఒకరు.
ఆస్తుల వివరాలు గమనిస్తే.. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నికర విలువ 11.4 మిలియన్లు అంటే దాదాపు రూ. 94 కోట్లు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన భారత ఆల్ రౌండర్ పాండ్యా ఐపీఎల్ నుంచి సుమారు 74.3 కోట్లు సంపాదించాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ 30 ఏళ్ల క్రికెటర్‌కు బరోడాలో రూ. 3.1 కోట్ల విలువైన పెంటా హౌస్, బాంద్రాలో రూ. 30 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉంది.
హార్దికా పాండ్యా క్రికెట్ నుంచే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. పాండ్యా గల్ఫ్ ఆయిల్, స్టార్ స్పోర్ట్స్, జిల్లెట్, బోట్, డ్రీమ్ 11, అమెజాన్, ఒప్పోతో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను కలిగి ఉన్నాడు. ఒక్కో బ్రాండెడ్ ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు వసూలు చేస్తారు.
అలాగే, మెర్సిడెస్ AMG G63,ఆడీ ఏA6, జీప్ క్యాంపస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు కూడా హార్దిక్ పాండ్యా గ్యారేజీలో ఉన్నాయి. నటాషా స్టాంకోవిచ్ నుండి విడాకుల పరిష్కారంలో హార్దిక్ పాండ్యా తన నికర విలువలో 70% కోల్పోబోతున్నారని పలు రిపోర్టులు ఇదివరకు నివేదించాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.