- Home
- Sports
- Cricket
- ఆల్‌రౌండర్లుగా యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ! రైనా, యువీల్లా మారుస్తామంటూ... బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే
ఆల్‌రౌండర్లుగా యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ! రైనా, యువీల్లా మారుస్తామంటూ... బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే
యువరాజ్ సింగ్, సురేష్ రైనా తర్వాత సరైన ఆల్‌రౌండర్లను తయారుచేయలేకపోయింది భారత జట్టు. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఫెయిల్యూర్‌కి ఇది కూడా కారణం. ఆల్‌రౌండర్లను తయారుచేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కామెంట్ చేశాడు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే..

టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ లాంటి బ్యాటర్లు కూడా టీమ్‌కి అవసరమైనప్పుడు బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసేవాళ్లు.. సచిన్ టెండూల్కర్‌కి రెండు ఫార్మాట్లలో కలిపి 200 వికెట్లు ఉన్నాయి..
Yuvraj Singh
యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి ఆల్‌రౌండర్ల కారణంగానే టీమిండియా, ఐసీసీ టోర్నీల్లో సక్సెస్ అవ్వగలిగింది. కెరీర్ ఆరంభంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, ఓపెనర్‌గా మారిన తర్వాత బౌలింగ్ వేయడమే మానేశాడు..
కెరీర్ ఆరంభంలో పేస్ ఆల్‌రౌండర్‌గా ప్రయత్నించిన విరాట్ కోహ్లీ, కొన్నేళ్లుగా బౌలింగ్ చేయడం మానేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ ముందు విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సీన్స్ వైరల్ అయినా, అతనితో బౌలింగ్ చేయించే సాహసం చేయలేదు టీమిండియా..
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టీమ్స్, ఐసీసీ టోర్నీల్లో సూపర్ సక్సెస్ సాధించడానికి ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండడమే కారణం. దీంతో టీమిండియా యంగ్‌స్టర్స్ తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌లను బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా మార్చేందుకు ఆలోచిస్తున్నట్టు కామెంట్ చేశాడు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే..
Yashasvi Jaiswal
‘ఆల్‌రౌండర్లు ఉండడం టీమ్‌కి చాలా ప్లస్. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ ఇద్దరినీ నేను అండర్19 రోజుల నుంచి చూస్తున్నా. వాళ్లిద్దరూ మంచి బౌలర్లు కాగలరు. ఇప్పటి నుంచి దానిపై వర్కవుట్ చేయడం అవసరం..
త్వరలోనే ఈ ఇద్దరూ బౌలింగ్ చేయడం చూస్తారు. అయితే దానికి కొంచెం సమయం పడుతుంది. ముందు వాళ్లతో కనీసం ఒక్కో ఓవర్ వేయించడానికి సిద్ధం చేస్తున్నాం..
Mukesh Kumar
ముకేశ్ కుమార్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలో ఆడే అవకాశం రావడం అతని అదృష్టమే. నట్టూ తర్వాత ఆ ఛాన్స్, ముకేశ్‌కే దక్కింది. టీమిండియాకి అతను త్రీ ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా పరాస్ మాంబ్రే...