- Home
- Sports
- Cricket
- రోహిత్‌కి దేవుడు స్పెషల్ టాలెంట్ ఇచ్చాడు, కోహ్లీలో అది లేదు... పాక్ ప్లేయర్ ఇమామ్ వుల్ హక్
రోహిత్‌కి దేవుడు స్పెషల్ టాలెంట్ ఇచ్చాడు, కోహ్లీలో అది లేదు... పాక్ ప్లేయర్ ఇమామ్ వుల్ హక్
విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి పడుతున్న కష్టం, ప్రతీ ఒక్కరూ అతను చేసి 70 అంతర్జాతీయ సెంచరీలను కూడా మరిచిపోయేలా చేసింది. పాక్ ప్లేయర్ ఇమామ్ వుల్ హక్ కూడా విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ భారత క్రికెట్‌కి ప్రధాన ప్లేయర్లు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లు... టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ ఇద్దరినీ పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇమామ్ వుల్ హక్...
‘రోహిత్ శర్మకు దేవుడిచ్చిన ఓ స్పెషల్ టాలెంట్, విరాట్ కోహ్లీలో లేదని నాకు అనిపిస్తుంది. నేను వారిద్దరి ఆటను చూస్తూ వచ్చాను. విరాట్ కోహ్లీ ఆట కంటే రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లను రిప్లే వేసుకుని చూడడానికే ఎక్కువగా ఇష్టపడతా...
రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఆ టైమింగ్ ఉంటుంది. ఫీల్డర్లు ఉన్నా టైమింగ్ వాడి చూడచక్కని షార్ట్స్ కొట్టడంలో రోహిత్ శర్మ దిట్ట.. విరాట్‌తో పోలిస్తే రోహిత్ శర్మ ఆటలో దూకుడు ఉంటుంది...
అతను మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడడానికి ఇష్టపడతాను, అది విరాట్ కోహ్లీ ఆటలో కనిపించదు. అందుకే రోహిత్ కొన్ని సెకన్లలోనే మ్యాచ్‌ని మార్చేయగలడు...
రోహిత్ క్రీజులో సెట్ అయితే అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం. అందుకే నేను రోహిత్ శర్మలా ఆడాలని కోరుకుంటున్నాను... ’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ క్రికెటర్ ఇమామ్ వుల్ హక్...
వన్డేల్లో రికార్డు స్థాయిలో మూడు డబుల్ సెంచరీలలు చేసిన రోహిత్ శర్మ, అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 నమోదు చేశాడు. అలాగే టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గానూ ఉన్నాడు రోహిత్..