- Home
- Sports
- Cricket
- టీమిండియాని ఓడించడమే ఆస్ట్రేలియాకి అసలైన ఛాలెంజ్... ఆసీస్ మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్...
టీమిండియాని ఓడించడమే ఆస్ట్రేలియాకి అసలైన ఛాలెంజ్... ఆసీస్ మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఊహించని షాక్ ఇచ్చింది శ్రీలంక. ఈ సీజన్‌లో తొలి పరాజయాన్ని రుచి చూపించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడేసింది. దీంతో ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుందామనుకున్న ఆస్ట్రేలియా, వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టెస్టు సిరీస్ రిజల్ట్ వరకూ వేచి చూడాల్సిన పరిస్థితుల్లో పడిపోయింది...

స్వదేశంలో టీమిండియా చేతుల్లో వరుసగా రెండు సిరీసుల్లో ఓడింది ఆస్ట్రేలియా జట్టు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆస్ట్రేలియా టీమ్‌ని 2019 పర్యటనలో చిత్తు చేసిన భారత జట్టు... 2020-21 పర్యటనలో 2-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది...
ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్‌లో పర్యటించి 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, శ్రీలంకపై 1-1 తేడాతో సిరీస్‌ని డ్రా చేసుకుంది. తొలి టెస్టులో ఓడిన తర్వాత రెండో టెస్టులో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆసీస్ టీమ్‌కి షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా...
వచ్చే ఏడాది ఫ్రిబవరి - మార్చి 2023లో భారత్‌లో పర్యటించనున్న ప్యాట్ కమ్మిన్స్ టీమ్... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2004 నుంచి స్వదేశంలో భారత్‌ని ఓడించలేకపోయింది ఆస్ట్రేలియా...
‘ఆస్ట్రేలియాకి భారత పర్యటన అసలు సిసలైన ఛాలెంజ్. 2004లో లక్కీగా భారత జట్టుని ఓడించి సిరీస్ గెలవగలిగాం. అయితే ఈసారి అంత ఈజీ కాదు. టీమిండియా ఇప్పుడు చాలా పటిష్టమైన జట్టు. అందులోనూ స్వదేశీ పరిస్థితులను ఎలా వాడుకోవాలో వాళ్లకు బాగా తెలుసు...
టీమిండియాని ఓడించాలంటే చాలా పకడ్భందీగా ప్లాన్స్ వేసుకుని బరిలో దిగాలి. బౌలర్లు కూడా పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని, త్వరగా అలవాటు పడాలి. ఐపీఎల్ కారణంగా చాలా మంది ప్లేయర్లు భారత్‌లో ఆడారు...
ఇక్కడి పరిస్థితులు ఆస్ట్రేలియా ప్లేయర్లకు కొత్తేమీ కాదు. అదీకాకుండా పాకిస్తాన్, శ్రీలంకలో సిరీస్‌లు ఆడడంతో ఉపఖండ పిచ్‌లపై పరిస్థితుల గురించి వారికో అవగాహన వచ్చి ఉంటుంది... అయినా భారత్‌ని ఓడించడం కష్టమైన పనే..
Pat Cummins with David Warner
ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లు ఉంటాయి. అవి ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలిస్తాయి. అయితే భారత్‌లో పిచ్‌లు పూర్తి స్పిన్ పిచ్‌లు. ఇక్కడ వికెట్ తీయాలంటే బౌలింగ్ స్టైల్‌ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది...
ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు చేయకుండా నియంత్రించగలగడం తెలియాలి. ప్లాన్స్ వర్కవుట్ కాకపోయినా వాటిని మార్చగలిగి ప్లాన్ బీతో సిద్ధంగా ఉండాలి. మొత్తానికి భారత పర్యటన, ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీకి ఓ పరీక్ష లాంటిది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్...
భారత్‌లో 8 టెస్టులు ఆడిన గ్లెన్ మెక్‌గ్రాత్ 21.3 యావరేజ్‌తో 33 వికెట్లు తీశాడు. 2004 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మెక్‌గ్రాత్, ఆ పర్యటనలోనే 14 వికెట్లు తీశాడు..