- Home
- Sports
- Cricket
- శ్రీలంక జెండాతో ఫోటోలకు ఫోజిచ్చిన గౌతమ్ గంభీర్... అదే పాక్ గెలిచి ఉంటే ఇలా చేసేవారా? అంటూ...
శ్రీలంక జెండాతో ఫోటోలకు ఫోజిచ్చిన గౌతమ్ గంభీర్... అదే పాక్ గెలిచి ఉంటే ఇలా చేసేవారా? అంటూ...
ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా ఆసియా కప్ 2022 టోర్నీని ఆరంభించింది శ్రీలంక. టోర్నీ ఆరంభంలో జరిపిన ఓటింగ్‌లో ఏ టీమ్ ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందని ఓటింగ్ పెడితే, అందులో శ్రీలంక జట్టుకి 0 సున్నా ఓట్లు పడ్డాయి... అయితే రెండు వారాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది..

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ 2022 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే లంకలో ఆర్థిక మాంద్యం పెరిగిపోయి, పరిస్థితులు అద్వాన్నంగా తయారయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించలేమని చేతులు ఎత్తేసింది లంక క్రికెట్ బోర్డు...
asia cup
దీంతో తటస్థ వేదిక యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరిగింది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘాన్ చేతుల్లో దారుణంగా ఓడిన శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ నుంచి అదిరిపోయే ఆటతీరు కనబర్చడం మొదలెట్టింది. బంగ్లాపై 2 వికెట్ల తేడాతో గెలిచిన లంక, ఆ తర్వాత భారత్, ఆఫ్ఘాన్‌లకు కూడా షాక్ ఇచ్చింది...
పాకిస్తాన్‌ని సూపర్ 4 రౌండ్‌లో చిత్తు చేసిన శ్రీలంక, ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత కూడా విజయం సాధించగలిగింది. 2018 నుంచి పాక్‌పై శ్రీలంక టీ20ల్లో ఓడిపోయింది లేదు. ఐదుకి ఐదు టీ20ల్లో లంకకే విజయాలు దక్కాయి..
Image credit: Getty
ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచినప్పటికీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంకా అర్హత సాధించలేదు శ్రీలంక. గ్రూప్ స్టేజీలో నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్ వంటి అసోసియేట్ జట్లతో తలబడబోతోంది శ్రీలంక...
Gautam Gambhir
శ్రీలంక ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచిన తర్వాత భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్, ఆ దేశ జాతీయ పతకంతో ఫోటోలకు ఫోజులివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. శ్రీలంక, భారత్ శత్రు దేశంగా భావించే పాకిస్తాన్‌ని ఓడించడం వల్లే గంభీర్... ఇలా లంక జెండాతో ఫోజులిచ్చాడని అంటున్నారు నెటిజన్లు...
అదే పాకిస్తాన్, శ్రీలంకను ఓడించి ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచి ఉంటే... భారతీయ జనతా పార్టీ నేత అయిన గౌతమ్ గంభీర్, పాక్ జాతీయ జెండాతో ఫోటోలకు ఫోజులు ఇచ్చేవాడా? అలా ఇచ్చి ఉంటే ఈ పాటికి అతన్ని భారతీయులు ప్రశాంతంగా బతకనిచ్చేవాళ్లా? అంటూ పోస్టులు చేస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్..