విరాట్ కోహ్లీ కష్టం ఎవ్వరికీ రాకూడదు.. సెలక్టర్లు ట్రిక్ మిస్ అయ్యారు... మహ్మద్ కైఫ్ కామెంట్స్!

First Published Nov 29, 2020, 2:52 PM IST

ఆసీస్ టూర్‌ను ఫేవరెట్స్‌గా ప్రారంభించిన టీమిండియా, మొదటి వన్డే ముగిసేసరికి చతికిలపడిపోయింది. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు తేలిపోవడం సగటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీమిండియాలో టాప్ బౌలర్లుగా గుర్తింపు పొందిన జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనికి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి రెండు మ్యాచుల్లోనూ ఐదుగురు బౌలర్లతో బరిలో దిగింది భారత జట్టు. బుమ్రా, షమీ, సైనీలతో పాటు జడేజా, చాహాల్‌లపై ఆధారపడింది.

బౌలర్లు తేలిపోవడంలో పార్ట్ టైమ్ బౌలర్ అందుబాటులో లేకపోవడం భారత జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రెండో వన్డేలో హార్దిక్ పాండ్యాకు బంతి ఇవ్వాల్సి వచ్చింది.

సెప్టెంబర్ 2019లో చివరిసారిగా బౌలింగ్ చేసిన హార్ధిక్ పాండ్యా... ఏడాది తర్వాత తొలిసారి బౌలింగ్ చేశాడు. అయితే నాలుగు ఓవర్లు వేసిన తర్వాత పాండ్యా ఇబ్బంది పడుతూ పెవిలియన్ బాట పట్టాడు.

‘ఈ టూర్‌లో విరాట్ కోహ్లీ కష్టం ఎవ్వరికీ రాకూడదు. భారత పేసర్లు ఫెయిల్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా వెన్నెముక ఆపరేషన్ తర్వాత సరైన ఆల్‌రౌండర్ భారత జట్టులో లేడు...

జట్టులో ఐదుగురు బౌలర్లు ఉండడం వల్ల భారత బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుంది. టెయిలెండర్లు పెరుగుతారు. టాపార్డర్‌లో పార్ట్ టైమ్ బౌలర్ లేడు, బెంచ్‌లో ఉన్న ప్లేయర్లలో కూడా అలాంటి ప్లేయర్ కనిపించడం లేదు.

భారత కెప్టెన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. సెలక్టర్లు ఈ ట్రిక్‌ను మిస్ అయ్యారు... ఐదుగురు బౌలర్లతో బరిలో దిగితే భారీ లక్ష్యాలను చేధించడం కష్టమవుతుంది. ఒకప్పుడు భారత జట్టును వెంటాడే నెంబర్ 4 బ్యాట్స్‌మెన్ సమస్యలా ఇప్పుడు సరైన ఆల్‌రౌండర్ వెతికి పట్టుకోవడం కష్టమైంది...

చివరి నిమిషాల్లో జట్టులో మార్పులు చేసే బీసీసీఐ, వచ్చే వరల్డ్‌కప్ ముందు భారత జట్టును ఎలా తయారుచేస్తోంది... ’ అంటూ ట్వీట్ చేశాడు మహ్మద్ కైఫ్.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో పెద్దగా రాణంచడం లేదు, బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపడం లేదు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్ వేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో జట్టులో సరైన ఆల్‌రౌండర్ మిస్ అయ్యాడని విమర్శిస్తున్నారు నెటిజన్లు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా, కృనాల్ పాండ్యా, అబ్దుల్ సమద్ వంటి ప్లేయర్లకు జట్టులో అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ఇప్పటికే ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలుస్తారా? అంటూ కొందరు మాజీ క్రికెటర్లు, టీమిండియా ఆటతీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెరికల్లాంటి యంగ్ ఆల్‌రౌండర్లను వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత సెలక్టర్లపై ఉంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?