- Home
- Sports
- Cricket
- నాన్నకు ప్రేమతో... తండ్రులతో మన క్రికెటర్లు! విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఎమోషనల్...
నాన్నకు ప్రేమతో... తండ్రులతో మన క్రికెటర్లు! విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఎమోషనల్...
Fathers day 2021: ఎంత చెప్పుకున్నా, ఎంత మెచ్చుకున్నా మన పుట్టుకకి కారణమైన తల్లికి దక్కే గౌరవం, గుర్తింపు.. తండ్రికి మాత్రం దక్కడం లేదు. సన్నాఫ్, డాటరాఫ్ అని తండ్రి పేరు చెప్పుకున్నా... అమ్మతో ఉండే చనువు, నాన్నతో ఉండదు. తల్లికి ఇచ్చే ప్రేమ, నాన్నకు దక్కదు. ఎంత అప్యాయంగా హత్తుకున్నా నాన్న అంటే ఎక్కడో ఓ చిన్న భయమే, ఆయన్ని మనసుకి కాస్త దూరంగా పెట్టిందేమో...

భారత క్రికెటర్లు మాత్రం తండ్రులకు చాలా గౌరవం ఇచ్చారు. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్‌లో పరుగుల వరద పారించి, రికార్డుల సునామీ సృష్టించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రికెట్ స్టార్లు తండ్రి మీద ఉన్న ప్రేమను క్రికెట్ కెరీర్‌గా మలుచుకున్నారు...
సచిన్ టెండూల్కర్ తండ్రి రమేశ్ టెండూల్కర్,1999, మే 19న మరణించారు. ఆ సమయంలో 1999 క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న సచిన్, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని, ఆ తర్వాతి రోజే తిరిగి జట్టుతో కలిశాడు..
पिता- प्रेम कोहली
విరాట్ కోహ్లీ తండ్రి ఫ్రేమ్ కోహ్లీ 2006లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కోహ్లీ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో ఢిల్లీ కెప్టెన్‌గా రంజీ ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి రోజు బ్యాటింగ్ చేసి తన జట్టును గెలిపించాడు...
‘నేను మొదటిసారి క్రికెట్ ఆడింది మా నాన్న ప్రేమ్ కోహ్లీతోనే... ఆయనే నాకు బౌలింగ్ చేసేవాడు. ప్లాస్టిక్ బ్యాటుతో బ్యాటింగ్ చేస్తుంటే మా నాన్న నన్ను చూసి మురిసిపోయేవారు...’ అంటూ తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ హైదరాబాద్‌లో ఓ ఆటో రిక్షా డ్రైవర్. కొడుకును భారత క్రికెటర్‌గా చూడాలని కలలు కన్న గౌస్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి చివరి చూపుకి నోచుకోని సిరాజ్, జట్టుతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు సిరీస్‌లో 14 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు సిరాజ్..
హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాల తండ్రి హామాన్షు పాండ్యా, అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ కొడుకులను క్రికెటర్లను చేశాడు. కృనాల్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడుతున్న సమయంలో హిమాన్షు పాండ్యా ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత టీమిండియా తరుపున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన కృనాల్, హాఫ్ సెంచరీ బాది తన ఇన్నింగ్స్‌ని తండ్రికి అంకితమిచ్చాడు..