- Home
- Sports
- Cricket
- ఫైనల్ మ్యాచ్‌కి టికెట్ కొన్నవాళ్లకి డబ్బులు ఎవరు ఇస్తారు?... టీమిండియాని వదలని ట్రోల్స్...
ఫైనల్ మ్యాచ్‌కి టికెట్ కొన్నవాళ్లకి డబ్బులు ఎవరు ఇస్తారు?... టీమిండియాని వదలని ట్రోల్స్...
టీ20 వరల్డ్ కప్ 2021 డిజాస్టర్ తర్వాత టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే రోహిత్ శర్మ కెప్టన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ జైత్ర యాత్ర కొనసాగించింది టీమిండియా. ఈ వరుస విజయాలతో ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు...

rohit sharma
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ 2018 టైటిల్ గెలిచింది టీమిండియా. మళ్లీ రోహిత్ కెప్టెన్సీలోనే ఆసియా కప్ 2022లో బరిలో దిగింది భారత జట్టు. దీనికి ముందు ఇంగ్లాండ్, వెస్టిండీస్ టూర్లలో ఘన విజయాలు అందుకుంది రోహిత్ సేన...
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడి టీమ్‌కి దూరమైనా... టీమిండియాపై అంచనాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆసియా కప్ 2022 టోర్నీలో పోటీలో ఉన్న ఫైవ్ టైమ్ ఛాంపియన్ శ్రీలంక పెద్దగా ఫామ్‌లో లేదు...
టీమిండియాకి బలమైన ప్రత్యర్థి ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ అనుకున్నారు. ఆఫ్ఘాన్ కూడా టాప్ ఫామ్‌లో ఉండడంతో ఫైనల్‌లో పాక్ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలబడుతుందని అనుకున్నారు. ఎలాగైనా భారత జట్టును ఫైనల్ చేరడం గ్యారెంటీ అని భావించారు.
అందుకే ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌కి భారతీయులు చాలామంది టికెట్లు కొనుక్కున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ లేదా, భారత్ వర్సెస్ ఆఫ్ఘాన్ ఉండవచ్చనే ఉద్దేశంతో భారీ ధర పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు టీమిండియా అభిమానులు.
అయితే అందరి అంచనాలు సూపర్ 4 రౌండ్‌లో తలకిందులయ్యాయి. టీమిండియా ఫైనల్ చేరకుండానే ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి నిష్కమించింది. దీంతో ఫైనల్ చూసేందుకు భారీ ధర పెట్టి టికెట్లు కొనుక్కున్నవాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు...
టీమిండియా మీద నమ్మకంతో భారీ ధర పెట్టి టికెట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు తమ డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారని వాపోతున్నారు. ఫైనల్ చేరిన పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ చూసేందుకు భారత జట్టు ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. దీంతో తమకి బీసీసీఐ, రీఫండ్ చేసి న్యాయం చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో తమ వాదన వినిపిస్తున్నారు...