కావ్య పాపకు పబ్లిక్‌గా ప్రపోజ్ చేసిన సౌతాఫ్రికా ఫ్యాన్... సన్‌రైజర్స్ యజమాని రియాక్షన్ ఏంటంటే...
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది అందమైన అమ్మాయిలు, కెమెరాలో కనిపించి ఓవర్‌నైట్ స్టార్లు, సెలబ్రిటీలుగా మారిపోయారు. అలాగే అప్పటికే సినిమాల్లో హీరోయిన్‌గా సెటిల్ అయిన పంజాబ్ కింగ్స్ సహ- యజమాని ప్రీతి జింటా కంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ యజమాని కావ్య మారన్‌కి మంచి ఫాలోయింగ్, క్రేజ్ వచ్చాయి...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతీ మ్యాచ్‌కి ఆరెంజ్ ఆర్మీ జెర్సీలో వచ్చే కావ్య మారన్, టీమ్ ఓడిన ప్రతీసారీ బుంగ మూతి పెట్టుకుని నిరాశగా కూర్చునేది. ఇదే కావ్య పాపకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది...
Kaviya maran IPL auction
తమ కోసం కాకపోయినా కనీసం కావ్య పాప ముఖంలో నవ్వు చూడడానికైనా గెలవాల్సిందిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని కోరుతూ వచ్చారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు. ఐపీఎల్ వేలంలో, ఎస్‌ఆర్‌హెచ్ ఆడే మ్యాచుల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే కావ్య మారన్... ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉంది...
సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది సన్‌నెట్‌వర్క్. ఇక్కడిలాగే కావ్య పాప, అక్కడ కూడా సన్‌రైజర్స్ టీమ్ ఆడే అన్ని మ్యాచులకు హాజరవుతూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆరెంజ్ జెర్సీలో వెలిగిపోతున్న కావ్య మారన్ జిగేల్ నవ్వుకి సౌతాఫ్రికా కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు...
తాజాగా పర్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ ఫ్రాంఛైజీ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి దక్కిన మూడో విజయం ఇది. ఈ మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఓ అభిమాని, ప్లకార్డుతో కావ్య మారన్‌కి పెళ్లి ప్రపోజ్ చేశాడు...
‘కావ్య మారన్.. విల్ యూ మ్యారీ మీ’ (కావ్య నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా...) అని రాసి ఉన్న బోర్డును ప్రదర్శించిన తెల్ల తోలు కుర్రాడు, చివర్లో లవ్ సింబల్ యాడ్ చేశాడు...
ఈ ప్రపోజల్‌ని బిగ్ స్క్రీన్ మీద చూసిన కావ్య మారన్, కాస్త ఆశ్చర్యానికి, కాస్త సంతోషానికి గురైనట్టు ముసిముసిగా సిగ్గుపడుతూ నవ్వేసింది. సౌతాఫ్రికా20 లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి చెందిన ప్రెటోరియా క్యాపిటల్స్ 4 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుని టాప్‌లో ఉంటే, సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ రెండో స్థానంలో కొనసాగుతోంది..