టీ20 వరల్డ్ కప్‌కి సంజూ శాంసన్ కావాల్సిందే... రిషబ్ పంత్‌కి ఇక రెస్ట్ ఇవ్వాలంటూ...
ఆసియా కప్ 2022 టోర్నీ పర్ఫామెన్స్ ఆధారంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో తలబడే జట్టును డిసైడ్ చేయనుంది బీసీసీఐ. డిఫెండింగ్ ఛాంపియన్‌గా, టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, సూపర్ 4 రౌండ్ నుంచే నిష్కమించడంతో పొట్టి ప్రపంచకప్‌లో సెలక్టర్లు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చని టాక్ వినబడుతోంది...
Sanju Samson
ఆసియా కప్ 2022 టోర్నీకి వికెట్ కీపర్‌గా ఎంపికైన రిషబ్ పంత్,పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. బ్యాటుతోనే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి ఒకే ఒక్క బంతిని ఫేస్ చేసే అవకాశం దక్కింది...
Sanju Samson
రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడంతో సంజూ శాంసన్‌కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. రిషబ్ పంత్ మంచి ఫీల్డర్, వికెట్ కీపర్ మాత్రమే కాకుండా ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించగల బ్యాట్స్‌మెన్...
Sanju Samson Player of the match
సంజూ శాంసన్ గురించి రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్, ఆసీస్ దివంగత క్రికెటర్ షేన్ వార్న్ చేసిన కామెంట్లను షేర్ చేస్తున్నారు అతని అభిమానులు. ‘సంజూ శాంసన్, అతను ఓ అద్భుతమైన ప్లేయర్. ఈ విషయం నేను ఎన్నో ఏళ్ల క్రితం చెప్పాను. సుదీర్ఘ కాలం ఆడగల సత్తా అతని సొంతం. టీమిండియాకి అతను మూడు ఫార్మాట్లలో ఎందుకు ఆడడం లేదో నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది...’ అంటూ కొన్ని నెలల క్రితం కామెంట్ చేశాడు షేన్ వార్న్...
Sanju Samson
రిషబ్ పంత్ కంటే వేగంగా బ్యాటింగ్ చేస్తూ, టెక్నికల్‌గా కూడా ఎంతో మెరుగైన సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘SanjuSamsonforT20WC’ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు...
Arshdeep Singh-Sanju Samson
రెండు మ్యాచులు ఆడిన ఆవేశ్ ఖాన్ పెద్దగా మెప్పించలేకపోయాడు. భువనేశ్వర్ కుమార్ కూడా డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించి, టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో పర్వాలేదనిపించిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యాడు...
Image credit: PTI
భారత ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, మొదటి నాలుగు మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా చాహాల్ ఫెయిల్యూర్, టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది... దీంతో వీరికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందా? అనేది అనుమానంగా మారింది.