నా కొడుక్కి విరాట్ అంటే పిచ్చి... కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు లేపమంటాడు... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్..

First Published Dec 1, 2020, 6:01 PM IST

విరాట్ కోహ్లీ... ఓ రన్ మెషిన్. ప్రపంచంలోనే అత్యంత మంది ఫాలోవర్స్ కలిగిన క్రికెటర్, అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్ కూడా. అయితే విరాట్‌కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అంతే మంది హేటర్స్ కూడా ఉన్నారు. రోహిత్, ధోనీ ఫ్యాన్స్‌కి విరాట్ అంటే నచ్చడు. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, భారత సారథి కోహ్లీ గురించి ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్... ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత భారత టీ20 కెప్టెన్సీ రోహిత్ శర్మకు అప్పగించాలని డిమాండ్ చేశాడు, ఇలా చేయడం వల్ల విరాట్‌కి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం దొరుకుతుందని చెప్పాడు.

ఈ వ్యాఖ్యలతో మైకేల్ వాన్‌కి విరాట్ కోహ్లీ అంటే పెద్దగా ఇష్టం లేదేమో అనుకున్నారు. కోహ్లీని శత్రువుగా భావించే భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇలాంటి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మైకేల్ వాన్. ‘నా కొడుకు ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడుతున్నాడు. అతనికి విరాట్ కోహ్లీ అంటే భలే ఇష్టం. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు నన్ను నిద్ర లేపు నాన్నా... అంటూ నా పక్కనే పడుకుంటాడు. మొదటిసారి అలా చెప్పినప్పుడు షాక్ అయ్యాను...

ఆ తర్వాత విరాట్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కి ముందు ఇదే చెబుతాడు... ఈతరం పిల్లలపై విరాట్ కోహ్లీ ప్రభావం చాలా ఉంది. అతనికి కోట్ల మంది చిట్టి అభిమానులు ఉన్నారు. వారిలో నా కొడుకు కూడా ఒకడు...’ అంటూ కామెంట్ చేశాడు మైకేల్ వాన్.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఎంతో ఆసక్తిగా, శ్రద్దగా టీవీ చూసే తన కుమారుడు, అతను అవుట్ అవ్వగానే టీవీ ఆపేసి వేరే పనిలో పడిపోతాడని చెప్పాడు మైకేల్ వాన్...

‘విరాట్ కోహ్లీ చాలా స్పెషల్ బ్యాట్స్‌మెన్. అస్సలు కష్టపడకుండా సిక్సర్లు బాదడం కోహ్లీకి బాగా తెలుసు... కోహ్లీ ఫామ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్క సెంచరీ పడితే చాలు, మళ్లీ గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తాడు...’ అంటూ వ్యాఖ్యానించాడు మైకేల్ వాన్.

విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు టెస్టుల్లో గెలవడం చాలా కష్టమని చెప్పిన మైకేల్ వాన్... కోహ్లీ లేని టీమిండియా ఎలా పోరాడుతుందో చూడడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?