దినేశ్ కార్తీక్‌కి ప్లేస్ ఇక కన్ఫార్మ్... టీ20 వరల్డ్ కప్ 2022లో ఆ ఇద్దరూ డౌటే...
ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ కొనసాగిస్తున్న దినేశ్ కార్తీక్, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపులు మెరిపించాడు...

రోహిత్ శర్మ 64, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది భారత జట్టు. 138 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా, 190 పరుగుల భారీ స్కోరు చేసిందంటే దానికి దినేశ్ కార్తీక్ ఇన్నింగ్సే కారణం...
Image credit: PTI
19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన దినేశ్ కార్తీక్‌కి ఈ సీజన్‌లో ఇది రెండో అవార్డు...
Image credit: PTI
అతి పెద్ద వయసులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన భారత ప్లేయర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు దినేశ్ కార్తీక్. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 ఏళ్ల 186 రోజుల వయసులో రోహిత్ శర్మ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిస్తే, సౌతాఫ్రికాపై 37 ఏళ్ల 16 రోజుల వయసులో, తాజాగా 37 ఏళ్ల 58 రోజుల వయసులో ఈ అవార్డులను గెలుచుకున్నాడు దినేశ్ కార్తీక్...
Image credit: PTI
దినేశ్ కార్తీక్ మినహా 37 ఏళ్ల వయసులో టీ20ల్లో భారత ఆటగాళ్లు ఎవ్వరూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవలేకపోయారు. వెస్టిండీస్‌పై టీ20ల్లో అత్యధిక స్ట్రైయిక్ రేటు నమోదుచేసిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు దినేశ్ కార్తీక్..
Image credit: PTI
ఇంతకుముందు విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 70 పరుగులు చేసి 241.37 స్ట్రైయిక్ రేటు నమోదు చేస్తే 28 బంతుల్లో 62 పరుగులు చేసిన రోహిత్ శర్మ 221.42 స్ట్రైయిక్ రేటుతో రెండో స్థానంలో నిలిచాడు. 19 బంతుల్లో 41 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ స్ట్రైయిక్ రేటు 215.78..
Image credit: PTI
ఏడు, అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారతప్లేయర్‌గా నిలిచాడు దినేశ్ కార్తీక్. ఇంతకుముందు 2012లో ఎమ్మెస్ ధోనీ 76 పరుగులు చేస్తే, దినేశ్ కార్తీక్ ఇప్పటికే 94 పరుగులతో టాప్‌లో నిలిచాడు...
Image credit: PTI
ఈ ఇన్నింగ్స్‌లో రాబోయే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో దినేశ్ కార్తీక్‌కి ప్లేస్ దాదాపు కన్ఫార్మ్ అయినట్టే అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... నిలకడగా పర్పామెన్స్ ఇస్తున్న కార్తీక్‌ని పక్కనబెట్టే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు..
అయితే దినేశ్ కార్తీక్ పర్పామెన్స్ బాగానే ఉన్నా టీ20ల్లో రిషబ్ పంత్ గణాంకాలు ఏ మాత్రం బాగోలేవు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఆకట్టుకోలేకపోయిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు, వన్డేల్లో సెంచరీలు చేస్తే... టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చి పర్వాలేదనిపించాడు...
Image credit: PTI
తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టూ డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో పంత్‌కి టీ20ల్లో ప్లేస్ ఉంటుందా? అనేది అనుమానంగా మారింది..
Image credit: PTI
సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కి టీమ్‌లో చోటు కరువైంది. తాజాగా విండీస్‌తో టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరంగా ఉండడంతో అతని ప్లేస్‌లో అయ్యర్‌కి అవకాశం దక్కింది. అయితే తొలి టీ20లో అయ్యర్ నాలుగు బంతులాడి డకౌట్ అయ్యాడు...
వన్డేల్లో వెస్టిండీస్‌పై శ్రేయాస్ అయ్యర్ యావరేజ్ 56.33గా ఉంటే టీ20ల్లో మాత్రం 9.75గా ఉంది. విండీస్ బౌలర్లు షార్ట్ బాల్‌తో అయ్యర్‌ని తెగ ఇబ్బందిపెడుతున్నారు. దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అయ్యర్‌కి చోటు దక్కడం కూడా అనుమానమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...