- Home
- Sports
- Cricket
- పేరుకు రిచెస్ట్ క్రికెట్ బోర్డు.. ఓ విజన్ లేదు.. ఓ ప్లానింగ్ లేదు.. బీసీసీఐపై దిగ్గజ క్రికెటర్ ఆగ్రహం
పేరుకు రిచెస్ట్ క్రికెట్ బోర్డు.. ఓ విజన్ లేదు.. ఓ ప్లానింగ్ లేదు.. బీసీసీఐపై దిగ్గజ క్రికెటర్ ఆగ్రహం
భారత క్రికెట్ టీమ్ సెలక్టర్లకు క్రికెట్ మీద కనసీ అవగాహన కూడా కరువైందని.. ముందుచూపు అసలే లేదని దిలీప్ వెంగ్‌సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఐసీసీ ట్రోఫీల నిరీక్షణను కొనసాగిస్తూ ఇటీవలే భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా మరోసారి నిరాశపరిచింది. ఆసీస్ చేతిలో భారత జట్టు 209 పరుగుల తేడాతో ఓడింది. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Image credit: Getty
ముఖ్యంగా టెస్టులలో ఎవరైనా ఆటగాడు గాయపడితేనో, అందుబాటులో లేకుంటేనో అతడిని భర్తీ చేసే ఆటగాళ్లను తయారుచేయడంలో బీసీసీఐ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. అదీగాక కెప్టెన్ రోహిత్ స్థానంలో టెంపరరీ కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను నియమించడం కూడా కరెక్ట్ కాదన్న వాదనలూ వినిపించాయి.
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ టీమ్ సభ్యుడు దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ టీమ్ సెలక్టర్లకు క్రికెట్ మీద కనసీ అవగాహన కూడా కరువైందని.. ముందుచూపు అసలే లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘ఆలిండియా సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులకు క్రికెట్ మీద కనీస అవగాహన, ముందు చూపు లేనట్టుంది. గడిచిన ఆరేడేండ్లుగా ఇది స్పష్టంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గత రెండేండ్లలో వాళ్లు మెయిన్ కెప్టెన్ అందుబాటులో లేకుంటే శిఖర్ ధావన్ తో కెప్టెన్సీ చేయించారు.
ఇది సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు. ధావన్ ఇప్పుడు టీమ్ లో కూడా లేడు. ధావన్ కు బదులు ఎవరైనా యువ ఆటగాడికి ఆ బాధ్యతలు అప్పజెప్తే బాగుండేది. వాళ్లు ఫ్యూచర్ కెప్టెన్ లుగా తయారుచేస్తే బావుండేది. కానీ సెలక్టర్లు మాత్రం అలా చేయలేదు. రోహిత్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడిని తయారుచేయడంలో బీసీసీఐ పూర్తిగా విఫలమైంది.
బీసీసీఐ పేరుకే ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు. కానీ బెంచ్ బలాన్ని పెంచుకునే సత్తా లేదు. ఏమైనా అంటే ఐపీఎల్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం.. మీడియా హక్కుల ద్వారా వేలాది కోట్లు సంపాదిస్తున్నామనడం.. ఇంతే.. ఇంతకుమించి జాతీయ జట్టును పట్టించుకునే దిక్కులేదు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.