- Home
- Sports
- Cricket
- ఆ ముగ్గురి మధ్యే పోటీ, ఎవరు ఆడతారో చెప్పలేం... టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్...
ఆ ముగ్గురి మధ్యే పోటీ, ఎవరు ఆడతారో చెప్పలేం... టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్...
సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు కోసం ఎదురుచూస్తున్న టీమిండియాని ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్‌ను ఎంపిక చేయడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంపై టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, ఆరంగ్రేటం టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు...
తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టు తర్వాత మళ్లీ భారత జట్టు తరుపున మ్యాచ్ ఆడలేకపోయాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి...
సౌతాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన హనుమ విహారి, రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు...
సరిగ్గా ఏడాది క్రితం మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేసి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన అజింకా రహానే, ఆ తర్వాత ఘోరంగా విఫలమవుతున్నాడు...
ఈ ఏడాది 19.51 సగటుతో పరుగులు చేసి, టాపార్డర్‌లో అతి తక్కువ యావరేజ్ నమోదు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సౌరవ్ గంగూలీని కూడా అధిగమించాడు అజింకా రహానే...
‘ఐదో స్థానంలో ఎవరిని ఆడించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఎందుకంటే అది చాలా క్లిష్టమైన విషయం. అజింకా రహానే, టెస్టు టీమ్‌కి ఎప్పుడూ చాలా కీలకమైన ప్లేయర్.
తన కెరీర్‌లో ఎన్నో సార్లు అమూల్యమైన పరుగులు చేసి, భారత జట్టును పరాజయాల నుంచి కాపాడాడు రహానే. అయతే కొన్నాళ్లుగా అతని ఫామ్ సరిగా లేదు...
అయితే మెల్‌బోర్న్‌లో రహానే ఆడిన ఇన్నింగ్స్, లార్డ్స్ టెస్టులో పూజారాతో కలిసి నిర్మించిన భాగస్వామ్యం జట్టుకి ఎంతో విలువైనవి. ఆ రెండు మ్యాచుల్లో విజయానికి రహానే ఇన్నింగ్స్‌లు కూడా ఓ కారణం...
కాన్ఫూర్ టెస్టులో ఆరంగ్రేటం చేసిన శ్రేయాస్ అయ్యర్, వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. రెండు టెస్టుల్లోనూ సత్తా చాటిన అయ్యర్‌ను పక్కనబెట్టడం సమంజసం కాదు...
హనుమ విహారి కూడా చాలా మంచి ప్లేయర్. సౌతాఫ్రికాలో పరుగులు చేసిన అనుభవం కూడా విహారికి ఉంది. ఈ ముగ్గురిలో ఎవరు ఆడతారు? ఎవరిని ఆడించాలనేది చాలా పెద్ద సమస్యగా మారింది...’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్...