MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • DDCA: ఇదేందయ్యా ఇది.! కీపింగ్ చేయనోడు వికెట్ కీపరా.? ఇంతకన్నా దరిద్రం మరొకటి లేదు

DDCA: ఇదేందయ్యా ఇది.! కీపింగ్ చేయనోడు వికెట్ కీపరా.? ఇంతకన్నా దరిద్రం మరొకటి లేదు

DDCA: రాజకీయాలు అనేవి ఏ రంగంలో ఉండవు చెప్పండి. ఐటీ సెక్టార్ దగ్గర నుంచి క్రికెట్ వరకు.. తనవాడే జట్టులో ఉండాలని కొందరు సెలెక్టర్లను ఫోర్స్ చేస్తే.. లేదు మావాడే ఫైనల్ అంటూ మరికొందరు.. ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు చేసుకుంది. 

2 Min read
Author : Pavithra D
Published : Oct 08 2025, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీడీసీఏలో పెద్ద గోల్ మాల్
Image Credit : DDCA Twitter

డీడీసీఏలో పెద్ద గోల్ మాల్

ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(DDCA) పెద్ద వివాదంలో చిక్కుకుంది. మరో రెండు రోజుల్లో వినూ మన్కడ్ ట్రోఫీ(Vinoo Mankad Trophy) రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అండర్-19 జట్టును డీడీసీఏ ఎంపిక చేయగా.. ఈ ఎంపిక ఓ పెద్ద గోల్‌మాల్ బయటపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కీపింగ్ అనుభవం లేకుండానే ఎంపిక
Image Credit : DDCA Twitter

కీపింగ్ అనుభవం లేకుండానే ఎంపిక

వికెట్ కీపర్‌గా అనుభవం లేని ఓ ఓపెనింగ్ బ్యాటర్‌ను ఢిల్లీ అండర్ 19 జట్టులో రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇదంతా కూడా డీడీసీఏలోని ఓ సీనియర్ అధికారి ఒత్తిడి వల్లే జరిగిందని ఇన్‌సైడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కసారిగా ఈ ఎంపిక కారణంగా జట్టు ఎంపిక విషయంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో.. చివరికి తలొగ్గి ప్రాబబుల్స్‌లో కీలక మార్పులు చేయాల్సి వచ్చింది.

35
సీనియర్ అధికారి ఒత్తిడి వల్లే..
Image Credit : DDCA Twitter

సీనియర్ అధికారి ఒత్తిడి వల్లే..

అక్టోబర్ 3వ తేదీన 23 మంది సభ్యులతో కూడిన ఢిల్లీ అండర్ 19 జట్టును ప్రకటించగా.. అందులో అభిరాజ్ గగన్ సింగ్‌ను వికెట్ కీపింగ్‌కు ఫస్ట్ ఛాయిస్‌గా పేర్కొన్నారు. అయితే స్క్వాడ్‌లోని 22వ ప్లేయర్‌ను సెకండ్ అండ్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే ఆ స్లాట్‌లో అస్సలు ఇప్పటిదాకా వికెట్ కీపింగ్ చేయని ఆటగాడిని ఎన్నుకున్నట్టు జాతీయ మీడియా పలు కథనాల్లో పేర్కొంది. ఆపై ఒక్కసారిగా అసోసియేషన్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని పలువురు సీనియర్ DDCA అధికారులు నేరుగా అధ్యక్షుడు రోహన్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. అర్హత ఆధారంగా కాకుండా.. ఇలా ఒకరిద్దరి పెద్దల ఒత్తిడి వల్ల ఆటగాళ్లను టీంలో చేర్చుకోవడం సరికాదని వాపోయారు. దీంతో వెంటనే జైట్లీ ఈ అంశంపై చర్యలు తీసుకున్నారు

45
అధ్యక్షుడి ఆదేశాలతో తొలగింపు..
Image Credit : DDCA Twitter

అధ్యక్షుడి ఆదేశాలతో తొలగింపు..

ఆ ఆటగాడి స్థానంలో జెన్యూన్ బ్యాకప్ వికెట్ కీపర్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో సర్దుబాటు చర్యలు త్వరతగిన పూర్తవ్వడమే కాకుండా.. స్క్వాడ్ ఇప్పటికే వినూ మన్కడ్ ట్రోఫీ కోసం రాంచీకి చేరుకుంది. ఇక ఈ ఘటన విషయంలో సెలెక్టర్ల తప్పు లేదని అంతర్గత వర్గాలు తెలిపాయి. బ్యాకప్ వికెట్ కీపర్‌కు బదులుగా.. కీపింగ్ తెలియని ఓపెనింగ్ బ్యాటర్‌కు వికెట్ కీపర్ అనే ముద్ర వేసేలా ఓ సీనియర్ డీడీసీఏ అధికారి చేశారని సెలెక్టర్లు ఆరోపించారు. వివాదం ఇంతటితో ఆగలేదు. జట్టులో మరో రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. వయస్సు ధృవీకరణకు సమర్పించిన డాక్యుమెంట్స్‌ సరిగ్గా లేకపోవడం వల్ల ఒకరిని.. కారణాలు తెలియవి గానీ మరో ఆటగాడిని కూడా మార్చాల్సి వచ్చింది.

55
రాంచీలో ఢిల్లీ అండర్-19 టీం..
Image Credit : DDCA Twitter

రాంచీలో ఢిల్లీ అండర్-19 టీం..

డీడీసీఏ అధికారులు సెలెక్షన్ కమిటీ సమావేశాలకు హాజరు కావడంపై నిషేధాన్ని విధిస్తూ లోక్‌పాల్(అంబుడ్స్‌మన్) గత సంవత్సరమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయగా.. వాటిని బేఖాతరు చేస్తూ కార్యదర్శి అశోక్ శర్మ, జాయింట్ సెక్రటరీ అమిత్ గ్రోవర్.. ఇటీవల అషు డాని అధ్యక్షతన జరిగిన U19 సెలక్షన్ ప్రక్రియకు హాజరైనట్టు తెలుస్తోంది. అంతర్గత రాజకీయాలు జట్టు ఎంపికను ప్రభావితం చేస్తే.. అది కచ్చితంగా ఢిల్లీ క్రికెట్‌ను దెబ్బతీస్తాయని.. డీడీసీఏ పాలన, పారదర్శకతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తాయని అసోసియేషన్ సభ్యుడు సురేష్ కుమార్ శర్మ అన్నారు. ఈ ఘటనపై ఆయన సెప్టెంబర్ 28న అధ్యక్షుడు జైట్లీకి లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని కోరారు. కాగా ఢిల్లీ అండర్ 19 జట్టు ప్రస్తుతం రాంచీలో ముమ్మర కసరత్తులు చేస్తోంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
Cricket: 145 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి!
Recommended image2
Top 10 Test Cricket Spinners: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్లు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved