- Home
- Sports
- Cricket
- డేవిడ్ వార్నర్ ఇప్పుడు గాయపడిన సింహం! వాళ్లకు సరైన బుద్ధి చెబుతాడు... షేన్ వాట్సన్ కామెంట్స్...
డేవిడ్ వార్నర్ ఇప్పుడు గాయపడిన సింహం! వాళ్లకు సరైన బుద్ధి చెబుతాడు... షేన్ వాట్సన్ కామెంట్స్...
కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి 2016 సీజన్‌లో టైటిల్ అందించాడు డేవిడ్ వార్నర్. అంతేకాకుండా ఐదు సీజన్ల పాటు ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ భారాన్ని తాను ఒక్కడే మోస్తూ వచ్చాడు. సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, సరైన భారత బ్యాటర్ లేని సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐదుసార్లు ప్లేఆఫ్స్ ఆడిందంటే దానికి కారణం వార్నర్ ఒక్కడే...

ఐపీఎల్‌లో 5881 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, డేవిడ్ వార్నర్‌ని ఘోరంగా అవమానించి, కెప్టెన్సీ నుంచి ఆ తర్వాత టీమ్ నుంచి తప్పించింది..
ఆఖరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచులు చూసేందుకు కూడా తనను అనుమతించడం లేదంటూ డేవిడ్ వార్నర్, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో వాపోయాడు. ఈ సంఘటన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఉన్న కాస్తో కూస్తో ఫాలోయింగ్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది...
David Warner
మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా డేవిడ్ వార్నర్‌ని తీవ్రంగా అవమానిస్తూ వస్తోంది. సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తనపై విధించిన జీవితకాలపు కెప్టెన్సీ బ్యాన్‌ని తొలగించాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియాని ఆశ్రయించాడు డేవిడ్ వార్నర్. ఆ సమయంలో ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్, ఇప్పుడు బ్యాన్ నుంచి బయటపడి ఆస్ట్రేలియాకి తాత్కాలిక కెప్టెన్‌గా కూడా చేస్తున్నాడు..
Image credit: PTI
అలాంటిది డేవిడ్ వార్నర్‌పై వేసిన కెప్టెన్సీ లైఫ్ టైం బ్యాన్ మాత్రం తొలగించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. కెప్టెన్‌పై వేసిన వేటు తీసేసి, వైస్ కెప్టెన్‌ని ఇంతగా వేధించడం దేనికో జనాలకు అర్థం కావడం లేదు.
Image credit: PTI
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని స్థానంలో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు డేవిడ్ వార్నర్.. ఇది లేటు వయసులో డేవిడ్ వార్నర్‌కి దక్కిన చాలా గొప్ప అవకాశం...
Image credit: PTI
‘డేవిడ్ వార్నర్, ఐపీఎల్ 2023 సీజన్ ఓ సువర్ణాకావశం లాంటిది. ఈ సీజన్‌లో అతను చాలామందికి ఎన్నో విషయాలు నిరూపించుకోవాలి. ఐపీఎల్‌లో అతను చాలా పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా వచ్చి ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో నిలబడి మ్యాచులు గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి..
డేవిడ్ వార్నర్ గత రెండేళ్లలో చాలా అవమానాలు భరించాడు. ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కింది. అతను దీన్ని ఎలా వాడుకుంటాడో చూడాలని ఉంది..
మిచెల్ మార్ష్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఫామ్‌లో ఉంటే ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. సౌతాఫ్రికా బ్యాటర్ రిలే రసో కూడా అదరగొడుతున్నాడు. పాక్ సూపర్ లీగ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్‌లు ఆడాడు...
అతను వరల్డ్ క్లాస్ హిట్టర్. ఎలాంటి బౌలర్‌నైనా మట్టికరిపించగల మాస్టర్ బ్యాటర్. ఐపీఎల్‌లో చాలామంది సత్తా ఉన్న కుర్రాళ్లు ఉన్నారు. కమ్లేశ్ నాగర్‌కోటి, చేతన్ సకారియా వంటి కుర్రాళ్లు ఎలా ఆడతారో చూడాలి. వాళ్లకి ఈ సీజన్ టర్నింగ్ పాయింట్ అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కన్సెల్టెంట్ కోచ్ షేన్ వాట్సన్.
.