డేవిడ్ మిల్లర్... సర్‌ప్రైజ్ ఆఫ్ ది సీజన్! అతను ఇలా ఆడతాడని ఎవ్వరూ ఊహించలేదు..
ఐపీఎల్‌లో అట్టర్‌ఫ్లాప్ అయిన క్రికెటర్లలో డేవిడ్ మిల్లర్ ఒకడు. సౌతాఫ్రికాకి చెందిన ఈ బ్యాటర్ 2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 8 సీజన్ల పాటు పంజాబ్‌కి ఆడిన డేవిడ్ మిల్లర్, 2020-21 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడాడు. ఈ సారి గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడి, అదరగొట్టాడు...

ఐపీఎల్ 2012 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున 6 మ్యాచులు ఆడిన డేవిడ్ మిల్లర్, 2013లో 12 మ్యాచులు ఆడి 418 పరుగులు చేశాడు. 2014 సీజన్‌లో 446 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్, ఫైనల్‌కి చేరడంలో కీలక పాత్ర పోషించాడు..
ఆ తర్వాతి సీజన్‌లో 357 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, 2016లో 161, 2017లో 83, 2018లో 74, 2019లో 213 పరుగులు చేశాడు. సీజన్లు గడిచేకొద్దీ మిల్లర్ పర్ఫామెన్స్ పడిపోతూ వచ్చింది...
దీంతో 20220 సీజన్‌లో మిల్లర్‌ని కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడించింది. అందులోనూ మిల్లర్‌కి బ్యాటర్ రాలేదు. 2021లో 9 మ్యాచులు ఆడి 124 పరుగులు మాత్రమే చేశాడు డేవిడ్ మిల్లర్...
Image credit: PTI
సీజన్లు గడిచేకొద్దీ డేవిడ్ మిల్లర్ పర్ఫామెన్స్ పడిపోతూ ఉండడంతో తొలుత మెగా వేలంలో ఏ జట్టూ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. అయితే రెండోసారి వేలానికి వచ్చినప్పుడు రూ.3 కోట్లకు మిల్లర్‌ని కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...
2019 మినహా ఇస్తే గత నాలుగు సీజన్లలో కలిపి 18 మ్యాచులు ఆడిన డేవిడ్ మిల్లర్‌ని వరుస అవకాశాలు ఇస్తూ కొనసాగిస్తూ వచ్చింది గుజరాత్ టైటాన్స్. దానికి తగ్గట్టే మిల్లర్ కూడా ఈసారి అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన డేవిడ్ మిల్లర్ 68.71 సగటుతో 142.73 స్ట్రైయిక్ రేటుతో 481 పరుగులు చేశాడు. ఇందులో 9 సార్లు నాటౌట్‌గా నిలవడం విశేషం...
Image credit: PTI
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 94 పరుగులు చేసి ఒంతిచేత్తో గుజరాత్‌కి విజయాన్ని అందించిన డేవిడ్ మిల్లర్, క్వాలిఫైయర్ 1లో 38 బంతుల్లో 68 పరుగులు, ఫైనల్ మ్యాచ్‌లో 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు..
‘ఈ సీజన్‌లో డేవిడ్ మిల్లర్ పర్ఫామెన్స్ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్. అతను ఐపీఎల్ ఆరంభంలో రెండు సీజన్లు తప్ప పెద్దగా ఆడింది లేదు. ప్రతీ సీజన్‌లో ఫెయిల్ అవుతూ వచ్చాడు...
అలాంటిది ఈసారి కొత్త ఫ్రాంఛైజీకి వచ్చి, ఇలా ఆడడం ఆశ్చర్యం. అతనికి ఇదే బెస్ట్ ఐపీఎల్ సీజన్. నాకౌట్ మ్యాచుల్లో డేవిడ్ మిల్లర్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఎంతో అమూల్యమైనవి...
గుజరాత్ టైటాన్స్ విజయానికి డేవిడ్ మిల్లర్ కూడా ఓ కారణం. వాళ్లకి ఈ సీజన్‌లో అన్నీ కలిసి వచ్చాయి. అయితే ఇప్పటికీ గుజరాత్ టైటాన్స్‌ని బిగ్ టీమ్ అనలేం. వచ్చే ఏడాది వాళ్లు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...
‘నేను ఈ సీజన్‌ని బాగా ఎంజాయ్ చేశాను. గత నాలుగైదు ఏళ్లుగా నేను పడుతున్న కష్టం ఈ సీజన్‌లో కనిపించింది. గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. నిజం చెప్పాలంటే ఐపీఎల్‌లో ఇదే నాకు మోస్ట్ మెమొరబుల్ సీజన్...’ అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ మిల్లర్...