- Home
- Sports
- Cricket
- జడ్డూ ఇచ్చిన ఆ క్యాచ్ పట్టి ఉంటే, ఈరోజు ఆర్‌సీబీ పొజిషన్ మరోలా ఉండేది క్రిస్టియన్...
జడ్డూ ఇచ్చిన ఆ క్యాచ్ పట్టి ఉంటే, ఈరోజు ఆర్‌సీబీ పొజిషన్ మరోలా ఉండేది క్రిస్టియన్...
సర్ రవీంద్ర జడేజా... తనలోని ఊరమాస్ బ్యాట్స్‌మెన్‌ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో, ఊచకోత కోశాడు. ఐదు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 37 పరుగులు రాబట్టి, చరిత్ర క్రియేట్ చేశాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్న హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా మోగించిన సిక్సర్ల మోత... క్రికెట్ ఫ్యాన్స్‌ను కూడా విస్తుపోయేలా చేసింది.

ఆఖరి ఓవర్ ముందు వరకూ 154/4 పరుగులతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మహా అయితే 170 పరుగులు చేస్తుందని భావించారంతా. అయితే మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన జడ్డూ కారణంగా... మూడో బంతి ‘నో బాల్’గా వెళ్లింది. దాన్ని కూడా బౌండరీ అవతల వేసిన జడేజా, ఆ తర్వాతి బంతిని కూడా సిక్సర్ బాది... హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

నాలుగో బంతికి రెండు పరుగులు, ఐదో బంతికి సిక్సర్, ఆఖరి బంతికి బౌండరీ బాది... ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు క్రిస్ గేల్, రాహుల్ తెవాటియా మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

అయితే రవీంద్ర జడేజా ఇంతటి విధ్వంసం సృష్టించడానికి పరోక్షంగా కారణమయ్యాడు డానియల్ క్రిస్టియన్. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన జడేజా, ఐదో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించాడు. బౌండరీ లైన్ దగ్గర బంతిని అందుకునేందుకు రెండుసార్లు ప్రయత్నించిన క్రిస్టియన్, క్యాచ్‌ను జారవిడిచాడు.

అప్పటికి జడేజా ఇంకా ఖాతా కూడా తెరవలేదు. అంతకుముందు హర్షల్ పటేల్ వేసిన 14వ ఓవర్‌లో రెండు వరుస వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే, జడేజా క్యాచ్ తీసుకుని ఉంటే మరో వికెట్ కోల్పోయి ఉండేది. ఫలితంగా స్కోరుపై ప్రభావం పడేది.

డానియల్ క్రిస్టియన్ మిస్ చేసిన రవీంద్ర జడేజా క్యాచ్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చెరడానికి, ఆర్‌సీబీ ముందు భారీ టార్గెట్ ఉండడానికి కారణంగా నిలిచింది.