MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శివమ్ దూబే మాములోడు కాదుగా.. ఏకంగా ఆ మతం అమ్మాయినే ప్రేమించి.. అబ్బో, పెద్ద కథ నడిచిందే..!

శివమ్ దూబే మాములోడు కాదుగా.. ఏకంగా ఆ మతం అమ్మాయినే ప్రేమించి.. అబ్బో, పెద్ద కథ నడిచిందే..!

Shivam Dube:  చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్ లో  మిడిలార్డర్ లో  నిలకడగా రాణించిన బ్యాటర్  శివమ్ దూబే నేడు (జూన్ 26)  పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

2 Min read
Author : Srinivas M
| Updated : Jun 26 2023, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే శివమ్ దూబే  నేడు 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.   ధోని సారథ్యంలో ఈ మహారాష్ట్ర బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్ తో  పరుగుల వరద పారించి ఈ సీజన్ లో  సీఎస్కే విజయాలలో కీలక పాత్ర  పోషించాడు. అయితే ఆట సంగతి పక్కనబెడితే  దూబే లైఫ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హిందువైన దూబే..  ప్రేమించి పెళ్లి చేసుకున్నది మాత్రం ముస్లిం అమ్మాయిని.. దూబే భార్య పేరు అంజుమ్ ఖాన్.  ఈ ఇద్దరూ  సుదీర్ఘకాలం  ప్రేమించుకుని  పెద్దల్ని ఒప్పించి  మతాంతర వివాహం  చేసుకున్నారట.

37

శివమ్ దూబేది మహారాష్ట్ర కాగా అంజుమ్ ఖాన్ ఉత్తరప్రదేశ్ లోన అలీగఢ్  వాస్తవ్యురాలు.  ఈ ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకుని  2021లో పెళ్లి కూడా చేసుకున్నారు.  హిందూ, ముస్లిం సంప్రదాయాల్లో వీళ్ల పెళ్లి జరిగింది.   ఈ దంపతులకు కొడుకు కూడా ఉన్నాడు. ఆ బుడ్డోడి పేరు అయాన్.. 

47

అంజుమ్ ఖాన్  అలీగఢ్ యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసింది.  ఆమె   నటన మీద ఆసక్తితో  మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.   పలు టీవీ సీరియల్స్ తో పాటు  మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నది.  దూబే - అంజుమ్ లు పెళ్లి చేసుకున్న తర్వాత  ఆ ఫోటోలను   ఈ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.  

57

గత కొంతకాలంగా దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చాలామంది  ఈ జంటపై దుమ్మెత్తిపోశారు.   కొంతమంది వారి ప్రేమపై ప్రశంసలు కురిపించారు. దూబే - అంజుమ్ లు మతాల అడ్డుగోడలను బద్దలుకొట్టి  మనుషులుగా బతుకుతున్నారని కామెంట్స్ చేశారు.  

67

ఇప్పటికీ  దూబే ఇంట్లో రెండు  మతాలకు సంబంధించిన పండుగలను ఘనంగా జరుపుకుంటారట..  దూబేతో పాటు అంజుమ్ కూడా ఇన్‌స్టాలో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. 

77

ఇక దూబే విషయానికొస్తే.. ఈ సీజన్ లో  418 పరుగులు చేసిన అతడు  జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.   బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగల దూబే.. గతంలో భారత జట్టు తరఫున  పలు టీ20 మ్యాచ్ లు ఆడినా  ఆ అవకాశాలను పెద్దగా వినియోగించుకోలేదు.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved