క్రికెట్ కంటే ఏదీ ముఖ్యం కాదు... కోహ్లీ ప్లేస్‌లో వీరూ ఉంటేనా... సెహ్వాగ్ కోచ్

First Published Dec 24, 2020, 3:30 PM IST

పెటర్నిటీ లీవ్ మీద విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు. నటరాజన్ తన బిడ్డను చూడకుండా రెండు నెలలు గడిపితే, విరాట్ కోహ్లీ రెండు వారాల పాటు ఎదురుచూడలేడా? అంటూ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌కి కోచ్‌గా వ్యవహారించిన ఏఎన్ శర్మ కూడా కోహ్లీ నిర్ణయం సరైనది కాదన్నాడు.

ఐపీఎల్ తర్వాత చెప్పాపెట్టకుండా నటరాజన్‌ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్లిన బీసీసీఐ... విరాట్ కోహ్లీ విషయంలో ఎందుకు పక్షపాత వైఖరిలో వ్యవహరిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సునీల్ గవాస్కర్.

భారత జట్టులో లెజెండరీ క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చారని... విరాట్ మాత్రం పితృత్వ సెలవుల మీద స్వదేశానికి వెళ్లడం సరికాదని అన్నాడు వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాటింగ్ కోచ్ ఏఎన్ శర్మ.

‘ఒక ఆటగాడికి ఆట కంటే మించింది ఏదీ లేదు... ఆట మీకు ప్రతిదీ ఇచ్చింది... తండ్రి చనిపోయిన తర్వాత కూడా 1999 వరల్డ్‌కప్ ఆడడానికి తిరిగి జట్టులోకి వచ్చాడు సచిన్ టెండూల్కర్..

ఆటగాడికి అలాంటి డెడికేషన్ ఉండాలి... జట్టుపై అంకితభావంతో మెలగాలి. విరాట్ కోహ్లీ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండి ఉంటే.. అతను కచ్ఛితంగా క్రికెట్‌కే మొదటి ప్రాధాన్యం ఇచ్చేవాడు...

జట్టును ఇలా మధ్యలో వదిలేసి, స్వదేశానికి వచ్చేవాడు మాత్రం కాదు...’ అంటూ వ్యాఖ్యానించాడు ఏఎన్ శర్మ.

‘విరాట్ కోహ్లీ చాలా తెలివైన కెప్టెన్... మంచి క్రికెటర్ కూడా. జట్టులో అతను ఉంటే ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది. అందుకే పెటర్నిటీ లీవ్ మీద వెళ్లాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో నేను ఏకీ భవించను...

మొదటి టెస్టు ఓటమి తర్వాతైనా కోహ్లీ నిర్ణయం మార్చుకోవాల్సింది... ఎందుకంటే ఇప్పుడు జట్టుకి అతని అవసరం చాలా ఉంది. బిజీ షెడ్యూల్‌తో అలసిపోయి ఉంటే బ్రేక్ తీసుకోవడంలో తప్పులేదు...

కరోనా కారణంగా ఏడు నెలల పాటు క్రికెట్‌కి బ్రేక్ పడిన తర్వాత కూడా ఇలా వ్యక్తిగత కారణాలతో జట్టుకి దూరమవ్వడం సరికాదు... ’ అంటూ అభిప్రాయపడ్డాడు ఏఎన్‌శర్మ.

మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా ఏఎన్ శర్మ అభిప్రాయంతో ఏకీ భవించాడు. ‘దేశం తరుపున ఆడేందుకే ఏ ఆటగాడైనా తొలి ప్రాధాన్యం ఇవ్వాలి... నేను కోహ్లీ స్థానంలో ఉండి ఉంటే అదే చేసేవాడిని...

ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను వెళ్లొద్దని చెప్పే అధికారం బీసీసీఐకి ఉండదు... కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. కానీ ఆటగాడి డెడికేషన్ ఏంటనేది అందరికీ తెలిసిపోతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు దిలిప్ దోషి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?