సిడ్నీలో కరోనా కలకలం... మూడో టెస్టు వేదికగా మెల్‌బోర్న్... రోహిత్ శర్మ రాకపై డౌట్స్...
First Published Dec 24, 2020, 5:45 PM IST
దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా సిడ్నీ నగరంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు సిడ్నీ వేదికగా జరగాల్సి ఉంది. కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలోనే లాక్‌డౌన్ విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం... సిడ్నిలో రెండో, మూడో టీ20 మ్యాచులను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించింది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.

సిడ్నీ నగరంలో కరోనా టెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణంగా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆస్ట్రేలియా ప్లేయర్లు డేవిడ్ వార్నర్, సీన్ అబ్బాట్ రెండో టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.

బయో సెక్యూలర్ జోన్‌కి అవతల ఈ ఇద్దరూ ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో తిరిగి జట్టుతో కలిసేందుకు 14 రోజుల క్వారంటైన్ పీరియడ్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?