- Home
- Sports
- Cricket
- వాళ్లతో పోలిస్తే విరాట్, రోహిత్, పూజారా ఎందుకు పనికి రారు... షేన్ వార్న్ కామెంట్స్...
వాళ్లతో పోలిస్తే విరాట్, రోహిత్, పూజారా ఎందుకు పనికి రారు... షేన్ వార్న్ కామెంట్స్...
టీమిండియా టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తూ దూసుకుపోతోంది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు, ఇంగ్లాండ్ టూర్‌లోనూ అంత పని చేసింది... ఆఖరి టెస్టు రద్దు కావడంతో సిరీస్ ఫలితం కోసం వేచి చూడాల్సి ఉంది...

Virat Kohli
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అద్భుత విజయాలు అందుకుంటున్న భారత జట్టు, విదేశాల్లో అద్వితీయమైన పోరాటం చూపిస్తోంది...
ఈ విజయాల్లో ఓపెనర్‌గా మారిన రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వంటి ప్లేయర్ల పాత్ర ఎంతో ఉంది...
అయితే టీమిండియా మాజీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పోలిస్తే... ఇప్పటి ప్లేయర్లు ఎందుకూ పనికిరారని షాకింగ్ కామెంట్లు చేశాడు ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్...
‘ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ ది బెస్ట్ బ్యాట్స్‌మెన్. అన్ని ఫార్మాట్లలో అదరగొట్టే అలాంటి బ్యాటింగ్ సూపర్ స్టార్ ఉండడం ఏ జట్టుకైనా అదృష్టమే...
అయితే టీమిండియా ఫ్యాబ్ 5 వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లతో పోలిస్తే... ఇప్పటి బ్యాట్స్‌మెన్ ఎందుకూ పనికి రారు...
ప్రస్తుత భారత జట్టులో మంచి ప్లేయర్లే ఉన్నారు. టెస్టుల్లో టీమిండియాకే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉందని చెప్పుచ్చు. అయితే దుర్భేద్యమైన అప్పటి బ్యాటింగ్ ఆర్డర్‌తో పోలిస్తే మాత్రం వీళ్లు ఇంకా పిల్లలే...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్...
‘విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా మంచి బ్యాట్స్‌మెన్‌గా మారాడు. ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ బ్యాటింగ్‌లో చాలా మార్పు వచ్చింది...
రిషబ్ పంత్ కూడా భవిష్యత్తులో సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి... బ్యాటింగ్ విషయం పక్కనబెడితే ప్రస్తుతం భారత ఫాస్ట్ బౌలర్ల, ఏ పరిస్థితుల్లోనైనా అదరగొట్టగలమని నిరూపించారు..’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్...