- Home
- Sports
- Cricket
- CWG 2022: ఎవరీ బార్బొడాస్... కామన్వెల్త్ గేమ్స్‌లో వెస్టిండీస్ టీమ్‌కి బదులుగా వీళ్లెందుకు ఆడుతున్నట్టు...
CWG 2022: ఎవరీ బార్బొడాస్... కామన్వెల్త్ గేమ్స్‌లో వెస్టిండీస్ టీమ్‌కి బదులుగా వీళ్లెందుకు ఆడుతున్నట్టు...
2022 కామన్వెల్త్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతీ నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడా ఈవెంట్స్‌లో ఇది 22వ సీజన్. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ని జేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వహాకులు. అయితే భారత జట్టు ఉన్న గ్రూప్ Aలో బార్బొడాస్ టీమ్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఎవరీ బార్బొడాస్...

Image credit: PTI
బార్బొడాస్ కథ గురించి తెలుసుకోవాలంటే ముందుగా కామన్వెల్త్ కథ తెలుసుకోవాలి. రవి అస్తమించని బ్రిటీష్ ప్రభుత్వం ఆక్రమించుకుని, పరిపాలించిన దేశాల సముహమే కామన్వెల్త్...
Image credit: PTI
ఆంగ్లేయుల ఆధీనంలో 200 ఏళ్లు బానిసత్వం అనుభవించిన భారత్‌తో పాటు మరో 56 దేశాలు (ప్రస్తుతం వీటి సంఖ్య 72కి చేరింది) కలిసి కామన్వెల్త్ పోటీల్లో పాల్గొంటాయి. 1930లో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946 ఎడిషన్స్‌లో జరగలేదు...
2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరగగా, ఈసారి ఇంగ్లాండ్‌లో బర్మింగ్‌హమ్ వేదికగా 22వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి... జూలై 28న ప్రారంభమై ఆగస్టు 8న మగిసే ఈ క్రీడా పోటీల్లో 72 కామన్వెల్త్ దేశాలు పాల్గొంటున్నాయి.
ఇంతకుముందు క్రికెట్ కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఉండేది. 1998లో కౌల్హంపూర్‌లో జరిగిన పోటీల్లో చివరిగా మెన్స్ క్రికెట్ పోటీలు జరిగాయి. ఆ తర్వాత 24 ఏళ్లకు ఈసారి వుమెన్స్ క్రికెట్‌ని టీ20 ఫార్మాట్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో భాగం చేశారు...
భారత జట్టుతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంకతో పాటు బార్బొడాస్ జట్లు... కామన్వెల్త్ గేమ్స్ 2022లో మెడల్ కోసం పోటీపడుతున్నాయి... ఈ బార్బొడాస్ ఎలా పోటీల్లోకి వచ్చిందంటే...
అయితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 6లో ఉన్న వెస్టిండీస్ జట్టు, కామన్వెల్త్ గేమ్స్‌ని నేరుగా అర్హత సాధించింది. అయితే వారి స్థానంలో బార్బొడాస్ జట్టు, ఈ పోటీల్లో పాల్గొనబోతోంది...
<p>Hayley Matthews</p>
వెస్టిండీస్‌లోని అన్ని కరేబియన్ దేశాల్లో బ్రిటీష్ రాజ్యం సాగలేదు. అలా సాగి ఉంటే నేరుగా వెస్టిండీస్ జట్టు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేది. వెస్టిండీస్‌లోని బార్బొడాస్, గుయానా, జమైకా, ట్రిడినాడ్ అండ్ టొబాకో, లీవర్డ్ ఐస్‌లాండ్, విండ్‌వార్డ్ ఐస్‌లాండ్‌లను బ్రిటీష్ ప్రభుత్వం ఆక్రమించుకుంది...
Deandra Dottin
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఓ ప్రత్యేక టోర్నమెంట్‌ని నిర్వహించింది వెస్టిండీస్. ఇందులో విజేతగా నిలిచిన బార్బొడాస్ వుమెన్స్ టీమ్, కామన్వెల్త్ గేమ్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది...
గ్రూప్ Aలో ఆస్ట్రేలియా, టీమిండియా, పాకిస్తాన్‌లతో మ్యాచుుల ఆడనుంది బార్బొడాస్... ఆగస్టు 3న బార్బొడాస్‌తో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు..