ప్రాక్టీస్ కోసమే విజయ్ హాజారే ట్రోఫీకి దూరంగా పూజారా... దినేశ్ కార్తీక్ చెప్పిన లాజిక్ వింటే...
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నా, రెండో ఇన్నింగ్స్‌లో ఆ లోటు తీర్చుకున్నాడు. తన స్టైల్ బ్యాటింగ్‌కి విరుద్ధంగా ధనాధన్ షాట్లతో మెరుపులు మెరిపించి, ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు...
మొదటి సింగిల్ తీయడానికి 50కి పైగా బంతులు ఆడుతూ జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించడం ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా స్పెషాలిటీ. ఇంగ్లాండ్ టూర్ 2021లో పూజారా జిడ్డు బ్యాటింగ్‌పై అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయ్యింది...
Pujara-Gill
వికెట్ కాపాడుకోవడం కంటే పరుగులు చేయడం కూడా ముఖ్యమని బ్యాటర్లు తెలుసుకోవాలంటూ పూజారా గురించి పరోక్షంగా వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ... జిడ్డు బ్యాటింగ్, నిలకడ లేని ప్రదర్శన కారణంగా టీమ్‌లో చోటు కూడా కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా... కమ్‌బ్యాక్ తర్వాత వేరే లెవెల్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు..
Rishabh Pant-Pujara
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా త్వరగా డిక్లేర్ చేయడం పక్కా అని తెలియడంతో హాఫ్ సెంచరీ అందుకోవడానికే 140-150 బంతులు తీసుకునే ఛతేశ్వర్ పూజారా... ధనాధన్ బ్యాటింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు...
pujara
మొదటి 87 బంతుల్లో 41 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... 130 బంతుల్లో 13 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఛతేశ్వర్ పూజారా కెరీర్‌లో ఇదే ఫాస్ట్ సెంచరీ... 52 ఇన్నింగ్స్‌లు, 1400+ రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ అందుకున్నాడు ఛతేశ్వర్ పూజారా...
Cheteshwar Pujara
సాధారణంగా టెస్టు మ్యాచులకు ముందు ప్రాక్టీస్‌గా వేరే టోర్నీలు ఆడాలని అనుకుంటారు ప్లేయర్లు. అయితే ఛతేశ్వర్ పూజారా మాత్రం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి సిద్ధమయ్యేందుకు విజయ్ హాజారే ట్రోఫీకి దూరంగా ఉన్నాడట. దీనికి కారణం కూడా ఉందంటున్నాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...
‘రాజ్‌కోట్‌లో పిచ్ ఎర్రమట్టితో నిండి ఉంటుంది. బంగ్లాదేశ్‌లో పిచ్‌లు అలా ఉండవు. ఈ విషయం పూజారాకి బాగా తెలుసు. అందుకే సౌరాష్ట్ర తరుపున టీ20లు ఆడిన పూజారా, విజయ్ హాజారే ట్రోఫీకి మాత్రం దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఎర్ర మట్టి పిచ్‌పై బ్యాటింగ్‌కి అలవాటు పడితే, బంగ్లాదేశ్‌లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది..
అందుకే ఈ సమయంలో బంగ్లా పిచ్‌లకు దగ్గరగా ఉండే మైదానంలో ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాడు. పూజారా ఎప్పుడూ తన తండ్రితోనే ప్రాక్టీస్ చేస్తాడు. పూజారా తండ్రి, క్రికెట్‌పై ఆసక్తి ఉన్నవారందరూ ఉచితంగా వచ్చి ప్రాక్టీస్ చేసేలా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు...
పూజారా ఎప్పుడూ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ సిరీస్ జరుగుతుందో తెలుసుకుని, అక్కడి పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు ఆయన తండ్రి. అందుకే పూజారా నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ వచ్చింది..
ప్రాక్టీస్ కోసం మ్యాచులు అందరూ ఆడతారు. కానీ కొన్నిసార్లు అదే ప్రాక్టీస్ కోసం కొన్ని మ్యాచులకు దూరంగా ఉండాలనే విషయం ఛతేశ్వర్ పూజారా తెలియచేశాడు. టెస్టులకు తగ్గట్టు మైండ్‌సెట్‌ని సిద్ధం చేసుకున్నాడు. సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు..’ అంటూ కామెంట్ చేశాడు భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..