టీమిండియా ముందు సూపర్ ఛాన్స్... అయితే బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేస్తేనే...

First Published Dec 27, 2020, 6:26 AM IST

తొలి టెస్టులో మ్యాచ్ అలా మలుపు తిరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఓ మాదిరి స్కోరు చేసినా భారత జట్టుదే విజయం అనే ధీమాతో ప్రశాంతంగా పడుకున్న టీమిండియా ఫ్యాన్స్‌కి మూడో రోజు పీడకలలా మారింది. అయితే ఆ పీడకల నుంచి త్వరగానే బయటపడిన టీమిండియా, బాక్సింగ్ డే టెస్టులో మొదటి రోజు పూర్తి ఆధిక్యం కనబర్చింది.

పింక్ బాల్ టెస్టులో సిరీస్ ఆరంభించడం వల్ల టీమిండియాపై తీవ్ర ప్రభావం పడిందని అభిప్రాయపడ్డాడు సచిన్ టెండూల్కర్...

‘మనవాళ్లకి పెద్దగా డే నైట్ టెస్టుల అనుభవం లేదు. ఆసీస్ లాంటి టాప్ టీమ్‌తో పింక్ బాల్ టెస్టుతో సిరీస్ ఆరంభించడం కరెక్టు కాదు...

ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయాల్సి రావడం భారత బ్యాట్స్‌మెన్‌కి ఇబ్బంది కలిగించే అంశమే.. అదీకాకుండా మనవాళ్లు టెస్టు మ్యాచులు ఆడి చాలా కాలమైంది.

ఐపీఎల్ తర్వాత టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే సిరీస్, తర్వాత టెస్టు సిరీస్ ఆడి ఉండాలి... అప్పుడైతే బ్యాట్స్‌మెన్‌కి ఫార్మాట్‌కి తగ్గట్టుగా అలవాటు పడే అవకాశం దక్కుతుంది.

మొదటి మూడు టెస్టులు ముగిసిన తర్వాత పింక్ బాల్ టెస్టు ఆడి ఉంటే... టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరిగి ఉండేది...’ అని చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.

మొదటి రోజు పూర్తి ఆధిపత్యం కనబర్చినా  బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించాలంటే రెండు, మూడో రోజు ఆట చాలా కీలకం అవుతుందని అభిప్రాయపడ్డాడు ఆసీస మాజీ కెప్టెన్ మార్క్ టేలర్...

‘టీమిండియాకి ఇదో మంచి అవకాశం. టాప్ క్లాస్ బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్‌లో రాణిస్తే... రెండో టెస్టులో ఈజీగా గెలిచేయొచ్చు...

భారత జట్టులో టాప్ బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ లేకపోవడం నిజంగా వారికి పెద్ద లోటే. కానీ పూజారా, అజింకా రహానే వంటి టాప్ బ్యాట్స్‌మెన్ ఆ లోటు తెలియకుండా రాణించగలరు...

150+ ఆధిక్యం లభించినా... ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయగల సామర్థ్యం భారత బౌలర్ల దగ్గర ఉంది... కాబట్టి స్కోరు బోర్డుపై పరుగులు చేర్చాల్సిన బాధ్యత భారత బ్యాట్స్‌మెన్‌దే...’ అంటూ చెప్పుకొచ్చాడు మార్క్ టేలర్.

అయితే రెండో రోజు ఉదయం సెషన్‌లోనే పూజారా, శుబ్‌మన్ గిల్ వికట్లను కోల్పోయింది టీమిండియా. 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా, భారీ స్కోరు చేయాలంటే రహానే, హనుమ విహరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లో రావాల్సిందే.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?