గౌతమ్ గంభీర్ - రికీ పాంటింగ్ మాటల యుద్ధం.. ఎందుకు ఈ గలాట?
IND vs AUS: నవంబరు 22న ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. అయితే, ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్-ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్లు గౌతమ్ గంభీర్-రికీ పాంటింగ్ మధ్య మాటల యుద్ధంతో వాతావరణం హీటెక్కింది.
Virat Kohli, Gautam Gambhir, Ricky Ponting
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ - ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఇంకా ప్రారంభం కాలేదు, అయితే రెండు దేశాల దిగ్గజాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియన్ మీడియా నుండి దాని మాజీ ఆటగాళ్ల వరకు భారత జట్టు గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ హీటు పెంచుతున్నారు.
Gautam Gambhir-Rohit Sharma
హీటెక్కిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వాతావరణం
ఈ క్రమంలో భారత జట్టు ఆసీస్ టూర్‌కు బయలుదేరే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన ప్రకటనపై టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ మండిపడ్డాడు. గంభీర్ విలేకరుల సమావేశంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం దూకుడు విధానాన్ని అనుసరిస్తుందనే సూచనలు పంపాడు. భారత టీమ్ పై నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తున్న పాంటింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
విరాట్ కోహ్లి ఫామ్‌ను ప్రశ్నించవద్దని పేర్కొంటూ పాంటింగ్ తన సొంత పనిని చూసుకోవాలని చురకలంటించాడు గౌతమ్ గంభీర్. వెంటనే దీనిపై స్పందించిన పాంటింగ్ గంభీర్ ను అహంకార స్వభావం కలిగిన వ్యక్తిగా అభివర్ణించాడు. ''గత ఐదేళ్లలో విరాట్ కేవలం 2 (3) టెస్టు సెంచరీలు మాత్రమే చేశాడు. నాకు సరిగ్గా అనిపించలేదు, కానీ అది సరైనదైతే అది ఆందోళన కలిగించే విషయమంటూ'' విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కామెంట్ చేశాడు.
పాంటింగ్-గంభీర్ గలాట
మీడియా సమావేశంలో పాంటింగ్ కామెంట్స్ పై గంభీర్‌ను ప్రశ్నించగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పాంటింగ్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ.. భారత క్రికెట్‌కు పాంటింగ్‌కు సంబంధం ఏమిటి? అని గంభీర్ అన్నాడు. ''పాంటింగ్ రు ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలి. ఈ విషయంలో నాకేమీ చింత లేదు. వారు (కోహ్లీ-రోహిత్) చాలా బలమైన వ్యక్తులు. వీరిద్దరూ భారత క్రికెట్ కోసం చాలా సాధించారు. భవిష్యత్తులో కూడా చాలా సాధించబోతున్నారు'' అని పేర్కొన్నాడు.
ఒత్తిడిలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రోహిత్ 91 పరుగులు, కోహ్లి తన ఆరు ఇన్నింగ్స్‌లలో 93 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఇద్దరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు స్టార్లపై తప్పకుండా ఒత్తిడి ఉంటుంది. టీమిండియా పై కూడా ఒత్తిడి ఉంది. అయితే, అద్బుతంగా పునరాగమనం చేయాలని విరాట్-రోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Ricky Ponting
గంభీర్ కామెంట్స్ పై స్పందించిన పాంటింగ్.. ఇప్పుడు ఏం చెప్పాడు?
గంభీర్ వ్యాఖ్యలపై పాంటింగ్ స్పందిస్తూ.. "నేను రియాక్షన్ చదివి ఆశ్చర్యపోయాను, కానీ నాకు కోచ్ గౌతమ్ గంభీర్ తెలుసు...అతను అహంకార స్వభావంతో చాలా పదునైన వ్యక్తి, కాబట్టి అతను ఏదో చెప్పినందుకు నేను ఆశ్చర్యపోలేదని'' తెలిపాడు. అలాగే, తన ఇంతకుముందు చేసిన కామెంట్స్ ను ప్రస్తావిస్తూ.. భారత మాజీ కెప్టెన్‌ను లక్ష్యంగా చేసుకోవడం తన ఉద్దేశ్యం కాదని చెప్పాడు.
"నా కామెంట్స్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకోవడం కాదు. అతను ఆస్ట్రేలియాలో బాగా ఆడాడు. అతను ఇక్కడ తిరిగి రావడానికి ఆసక్తిగా ఉంటానని చెబుతున్నాను. అయితే, మీరు విరాట్‌ని అడిగితే, అతను సెంచరీలు చేయలేకపోతాడేమో అని కొంచెం ఆందోళన చెందడం ఖాయం. మునుపటి సంవత్సరాలలో లాగా చేయగలిగారు. కాబట్టి చిన్న విషయాలు దానిని ఎలా తగ్గించాయో ఆశ్చర్యంగా ఉంది, కానీ అతను క్లాస్ ప్లేయర్.. గతంలో ఆస్ట్రేలియాలో బాగా ఆడాడు" అని కోహ్లీ పై కామెంట్స్ చేశాడు.
Rohit Sharma-Virat Kohli Test
ఇబ్బంది పడుతున్న కోహ్లీ
రన్ మిషన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. వరుస వైఫల్యాలతో మాజీల నుంచి వస్తున్న విమర్శల క్రమంలో అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. 2024లో కోహ్లీ ఆటను గమనిస్తే ఈ ఏడాది 19 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 25 ఇన్నింగ్స్‌ల్లో 20.33 సగటుతో 488 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక టెస్టు క్రికెట్ లో ఆస్ట్రేలియాతో మొత్తంగా ఆడిన 25 మ్యాచ్‌లలో కోహ్లీ 44 సందర్భాలలో ఆస్ట్రేలియా పరిస్థితులలో వారి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 47.48 బ్యాటింగ్ సగటుతో 2,042 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై కోహ్లి స్ట్రైక్ రేట్ 52.41గా ఉంది.
కాగా, పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ స్టేడియంలో భారత్ తన తొలి ప్రాక్టీస్ సెషన్‌ను మంగళవారం నిర్వహించింది. నవంబర్ 22న అదే నగరంలోని ఆప్టస్ స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే 5 టెస్టుల సిరీస్‌లో కనీసం 4 మ్యాచ్‌లు గెలవాలి.