వాళ్లు ఆ పనులు ఆపేదాకా పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఉండవు! తేల్చి చెప్పేసిన భారత క్రీడా శాఖ మంత్రి...
2008లో ఐపీఎల్ ఆడిన పాకిస్తాన్ ప్లేయర్లు, ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి నిషేధించబడ్డారు. ఐసీసీ టోర్నీల్లో పాక్ బౌలర్లను ఫేస్ చేయడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడడానికి ఇది కూడా ఓ కారణం...
ఇండియా - పాకిస్తాన్ మధ్య 2007లో చివరిగా టెస్టు సిరీస్ జరిగింది. ఆ తర్వాత ఐదేళ్లకు 2012లో పాకిస్తాన్, భారత పర్యటనకు వచ్చింది. 11 ఏళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు..
India vs Pakistan
ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌కి వెళ్లారు.. అక్కడ రెండు మ్యాచులు చూసి, టీమ్ డిన్నర్‌లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చారు...
ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు త్వరలోనే జరగవచ్చనే ఆశలు క్రికెట్ ఫ్యాన్స్‌లో చిగురించాయి. పాక్ మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.. అయితే భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం భిన్నంగా స్పందించాడు..
‘క్రీడల పరంగా ఇండియా - పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరగవుతున్నాయి. అయితే పాకిస్తాన్ సరిహద్దులో తీవ్రవాద చర్యలను ఆపేంత వరకూ ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు. ఈ సెంటిమెంట్‌లో మార్పు ఉండదు..
దేశ ప్రజల క్షేమం కంటే ఏదీ ముఖ్యం కాదు. దేశ ప్రజలు కూడా సరిహద్దులో భారత జవాన్ల ప్రాణాలు తీస్తున్న వారితో క్రికెట్ ఆడాలని కోరుకోవడం లేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్..
India vs Pakistan
ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోయినా 2021 నుంచి ఇండియా- పాకిస్తాన్ మధ్య ప్రతీ ఏటా మ్యాచులు జరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు ఐసీసీ టోర్నీలు ఉండడంతో ఇండియా- పాక్ మధ్య ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మ్యాచులు చూడొచ్చు..