విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ మెగా వేలానికి ముందే స్టార్ క్రికెటర్ గుడ్ బై !
IPL - RCB : రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ వేలానికి ముందే విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టుకు బిగ్ హిట్టర్ గుడ్ బై చెప్పేశాడు.
Royal Challenger Bangalore: ఐపీఎల్-2025 మెగా యాక్షన్‌కు ఇంకా 5 నెలల సమయం ఉంది. అన్ని ఫ్రాంచైజీలు దీని కోసం సిద్ధమవుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు ట్రోఫీని గెలవని ఆర్సీబీ.. కొత్త జట్టును నిర్మించాలని నిర్ణయించుకుంది. మెగా యాక్షన్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లపై దృష్టి సారించాలనే ప్రణాళికల మధ్య ఓ స్టార్ ప్లేయర్ ఆర్సీబీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు.
అతనే గ్లెన్ మాక్స్‌వెల్.. ఆర్సీబీ జట్టు మ్యాచ్ విన్నర్. అతని భారీ హిట్టింగ్‌లతో గెలిచిన మ్యాచ్‌లకు లెక్క లేదు. 2021 నుండి అతను ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. మ్యాక్స్ వెల్ ఒక గేమ్ ఛేంజర్.. రిస్క్ టేకర్‌గా గుర్తింపు పొందాడు. 4 ఏళ్ల పాటు అద్భుతమైన వినోదాన్ని అందించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ తదుపరి ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి గుడ్‌బై చెప్పేందుకు రేడీగా ఉన్నాడని సమాచారం.
Glenn Maxwell
ప్రస్తుతం సోషల్ మీడియాలో మ్యాక్స్‌వెల్ ఆర్‌సీబీ జట్టు నుంచి తప్పుకుంటాడనే వార్తలు వైరల్ గా మారాయి. మెగా యాక్షన్ దగ్గరకు వచ్చేసరికి, మ్యాక్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీని అన్‌ఫాలో చేశాడు. బిగ్ హిట్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెడ్ ఆర్మీని అన్‌ఫాలో చేయడంతో అతను బెంగళూరు జట్టుకు గుడ్‌బై చెప్పబోతున్నాడనే చర్చ క్రికెట్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.
ఆన్‌ఫీల్డ్‌లో వీర సేనానిలా పోరాడే మాక్స్‌వెల్ గత సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కేవలం ఒక్క మ్యాచ్ లోనే కాకుండా మొత్తం టోర్నీ ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ కెరీర్ లోనే ఈ టోర్నీలో చెత్త ప్రదర్శన చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ 2024 లో 10 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 5.78 సగటుతో 52 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్‌లో 28 పరుగులే అత్యుత్తమ స్కోరు. బౌలింగ్ లో పెద్దగా చేసిందేమీ లేదు.
గత ఏడాది మాక్స్‌వెల్ అట్టర్ ఫ్లాప్ షో తో ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. అందుకే మెగా యాక్షన్ కంటే ముందే మ్యాక్స్ వెల్ ను టీమ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్, విల్ జాక్స్‌లను మాత్రమే ఉంచి మిగిలిన వారిని డ్రాప్ చేయాలనేది ప్లాన్ గా ఉందని సమాచారం.
ఈ విషయం తెలిసిన మ్యాక్స్ వెల్ మెగా వేలానికంటే ముందే జట్టునుంచి తప్పుకున్నాడనీ, అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీని అన్ ఫాలో చేశాడని చర్చ సాగుతోంది. రాబోయే సీజన్ లో కొత్త జట్టుకు ఆడతానని ఈ విధంగా హింట్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. దీనిపై ఆర్సీబీ ఫ్రాంచైజీ లేదా గ్లెన్ మాక్స్‌వెల్ అధికారిక ప్రకటన చేయలేదు.