బిగ్ స్టార్లకు షాక్.. వేలంలో దుమ్మురేపే ధరను పలికే టాప్-5 భారత ప్లేయర్లు వీరే
IPL 2025 Retention: ఐపీఎల్ 2025 కి ముందు ఆటగాళ్ల కోసం మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించాయి. అయితే, ఏవరూ ఊహించని విధంగా స్టార్ ప్లేయర్లను కూడా టీమ్స్ వదులుకున్నాయి.
Rishabh Pant,KL Rahul,Arshdeep Singh, IPL, IPL2025
IPL 2025 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు అన్ని ఫ్రాంఛైజీలతో వరుస సమావేశాల తర్వాత రాబోయే ఐపీఎల్ 2025 సీజన్, ఆటగాళ్ల రిటెన్షన్ కోసం కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది.
దీనికి అనుగుణంగా అన్ని ఫ్రాంఛైజీలు శుక్రవారం తమ రిటెన్షన్, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలు అధికారికంగా ప్రకటించాయి. ఆయా జాబితాను బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు అందించాయి. కొత్త నిబంధనల ప్రకారం.. ఐపీఎల్ జట్లు తమ టీమ్స్ నుంచి ఆరుగు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో క్యాప్డ్ ప్లేయర్లు, అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉంటారు.
బిగ్ క్రికెట్ స్టార్లకు షాకిచ్చిన ఐపీఎల్ టీమ్స్
అయితే, మెగా వేలానికి ముందు పలు టీమ్స్ బిగ్ స్టార్లను వదులుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వీరిలో ముగ్గురు కెప్టెన్లు కూడా ఉన్నారు. అయితే, రాబోయే ఐపీఎల్ వేలంలో వీరి కోసం చాలా ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశముంది. కాబట్టి వీరు ఐపీఎల్ వేలం లో రికార్డు ధరలను పలికే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఆ టాప్-5 ప్లేయర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. రిషబ్ పంత్
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ చాలా కాలం నుంచి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో స్టార్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 9 సంవత్సరాల అనుబంధం గురువారం అధికారికంగా ముగిసింది. అతని ఢిల్లీ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తాడు. కాబట్టి రిషబ్ పంత్ తో తమ టీమ్స్ లోకి తీసుకోవడానికి అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తిని చూపుతున్నాయి. వేలంలో అధిక ధర పలికే ప్లేయర్లలో ఒకరిగా రిషబ్ పంత్ ఉన్నాడు.
2. కేఎల్ రాహుల్
అందరూ అనుకున్నట్టుగానే కేఎల్ రాహుల్ ను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ (ఎల్ఎస్జీ) వదులుకుంది. దీంతో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కూడా వేలంలోకి వస్తాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో టీమ్ యజమాని గోయెంకా, కేఎల్ రాహుల్ పట్ల గ్రౌండ్ లో నడుచుకున్న తీరు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
LSG గత మూడు ఎడిషన్‌లలో ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో విఫలమవడం కూడా ఫ్రాంచైజీని కొత్త ఎంపికల కోసం ప్రయత్నాలు చేసేలా చేసింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్ 2024లో జట్టు ప్రదర్శన కూడా నిరాశపరిచింది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ శైలీని మార్చుకోకపోవడంతోనే అతన్ని వదులుకుంటున్నామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా IPL వేలంలో కేఎల్ రాహుల్ పక్క డిమాండ్ ఉన్న ప్లేయర్.
3. శ్రేయాస్ అయ్యర్
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ వదులుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గత సీజన్ లో జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. కేకేఆర్ కు మూడో టైటిల్ ను అందించాడు. కానీ, కేకేఆర్ శ్రేయాస్ ను ఐపీఎల్ 2025 సీజన్ కోసం జట్టుతో ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో అతను కూడా వేలంలోకి వస్తాడు. కాబట్టి వేలంలో అత్యధిక ధరను పలికే ప్లేయర్లలో ఒకడిగా శ్రేయాస్ అయ్యర్ తప్పకుండా ఉంటాడు. ఇప్పటికే ఢిల్లీ టీమ్ అతనితో చర్చలు జరిపిందనీ, రాబోయే సీజన్ కోసం కెప్టెన్సీని కూడా ఆఫర్ చేసిందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Arshdeep Singh
4. అర్ష్ దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ తన ఆటగాళ్ల కోర్ గ్రూప్‌ను పూర్తిగా విడుదల చేసింది. ఆ టీమ్ కేవలం ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆశ్చర్యకరంగా ఫ్రాంచైజీ తన ప్రధాన బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా విడుదల చేసింది. అతను 2019లో పంజాబ్ జట్టులో చేరాడు. గత ఎడిషన్‌లో కూడా అద్భుతమైన బౌలింగ్ తో 19 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇంత అద్భుతమైన ప్రదర్శన ఉన్నప్పటికీ పంజాబ్ ఫ్రాంచైజీ అర్ష్ దీప్ సింగ్ ను విడుదల చేసింది. దీంతో అను ఐపీఎల్ వేలంలోకి వచ్చాడు. ఈ భారత యంగ్ స్టార్ కోసం ఇతర టీమ్స్ ఆసక్తిని చూపుతున్నాయి.
5. ఇషాన్ కిషన్
జట్టును వీడుతాడనుకున్న రోహిత్ శర్మ ముంబై రిటెన్షన్ లిస్టులో కనిపించాడు. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్టులో ఇషాన్ కిషన్ పేరు లేదు. అతన్ని ఫ్రాంచైజీ విడుదల చేసింది. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత సీజన్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 14 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేశాడు. చాలా కాలం నుంచి ముంబై టీమ్ కు మంచి ప్రదర్శనలు అందించాడు. 26 ఏళ్ల ఈ ప్లేయర్ 2018 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అయితే, ఇషాన్ కిషన్ ఐపీఎల్ వేలంలో అధిక ధర పలికే ప్లేయర్లలో ఒకరిగా ఉంటాడని చెప్పవచ్చు.