- Home
- Sports
- Cricket
- నాకు తెలీదు కానీ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టున్నారు... ఓపెనర్ల మార్పుపై భువనేశ్వర్ కుమార్ కామెంట్...
నాకు తెలీదు కానీ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టున్నారు... ఓపెనర్ల మార్పుపై భువనేశ్వర్ కుమార్ కామెంట్...
రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సిరీస్‌కో కెప్టెన్, ఓపెనర్లతో ప్రయోగాలు చేస్తోంది టీమిండియా. కెఎల్ రాహుల్ గాయపడిన తర్వాత ఇషాన్ కిషన్‌తో పాటు దీపక్ హుడా, సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లను ఓపెనర్లుగా వాడిన భారత జట్టు, విండీస్‌తో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్‌ని ఓపెనర్‌గా పంపడం చర్చనీయాంశమైంది...

టూ డౌన్ స్పెషలిస్ట్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్, కొన్ని మ్యాచుల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చి మెప్పించాడు. అయితే అతన్ని ఓపెనర్‌గా పంపుతారని ఎవ్వరూ ఊహించలేకపోయారు...
రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్, తన స్టైల్‌కి విరుద్ధంగా బ్యాటింగ్ చేయబోయి వికెట్ పారేసుకున్నాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది టీమిండియా...
తాజాగా భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ప్రయోగాలపై మాట్లాడాడు. ‘వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు ఓపెనింగ్ పంపించారో నాకు తెలీదు. అయితే దీని వెనక ఏదో పెద్ద ప్లానింగ్, ప్రణాళిక జరుగుతున్నట్టుంది...
ఏదో కావాలని ఎవరో ఒకరిని ఓపెనింగ్ పంపిస్తున్నారనైతే అనుకోవడం లేదు. కోచ్, కెప్టెన్ ఏదో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నారు. అయితే అదోంటే నాకైతే తెలీదు...
అయితే రాహుల్ ద్రావిడ్ ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు భువనేశ్వర్ కుమార్..