- Home
- Sports
- Cricket
- KL Rahul: బీసీసీఐ ఫ్యూచర్ ప్లానింగ్.. టెస్టుల్లో కూడా అతడే వైస్ కెప్టెన్..? రేపో మాపో ప్రకటన
KL Rahul: బీసీసీఐ ఫ్యూచర్ ప్లానింగ్.. టెస్టుల్లో కూడా అతడే వైస్ కెప్టెన్..? రేపో మాపో ప్రకటన
India Tour Of South Africa: రేపు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడ ఆ జట్టుతో మూడు టెస్టులు ఆడనున్నది. అయితే ఈ సిరీస్ కు ముందు టెస్టులకు ఉప సారథిగా నియమితుడైన రోహిత్ శర్మ గాయంతో తప్పుకోవడంతో బీసీసీఐకి కొత్త వైస్ కెప్టెన్ ను వెతకాల్సిన పని పడింది.

టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ కు మరో అరుదైన ఛాన్స్ దక్కనుందా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు. త్వరలోనే అతడిని భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా చేయనున్నదని సమాచారం.
దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లబోయే టీమిండియా.. అక్కడ ముందు ఆ జట్టుతో మూడు టెస్టులు ఆడనున్నది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ.. ఇప్పటికే 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ జాబితాలో వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో బీసీసీఐకి కొత్త వైస్ కెప్టెన్ ను వెతకాల్సిన పని పడింది. అయితే రోహిత్ శర్మ స్థానంలో గతంలో టెస్టులకు ఉప సారథిగా ఉన్న అజింకా రహానేనే తిరిగి ఆ స్థానంలో నియమిస్తారని అనుకున్నా.. సెలెక్టర్లు మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు.
గత రెండేండ్లుగా పేలవమైన ఫామ్ లో ఉన్న రహానే కు ఇప్పటికే లెక్కకు మిక్కిలి అవకాశాలిచ్చిన బీసీసీఐ.. ఇకపై అతడికి ఛాన్స్ ఇవ్వదల్చుకోలేదు. అదీగాక దక్షిణాప్రికా సిరీస్ రహానే కెరీర్ ను డిసైడ్ చేయనుందని కూడా వార్తలు వస్తున్నాయి. రహానే తో పాటు ఇషాంత్ శర్మ, పుజారాల కెరీర్ కూడా ఈ సిరీస్ తో తేలిపోనుంది.
దీంతో రహానే కు బదులుగా.. రోహిత్ శర్మ స్థానాన్ని (దక్షిణాఫ్రికా సిరీస్ వరకు) కెఎల్ రాహుల్ తోనే భర్తీ చేయించాలని బీసీసీఐ భావిస్తున్నది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత కెఎల్ రాహుల్ నే బీసీసీఐ లీడర్ గా భావిస్తున్నది. ఆ క్రమంలోనే ఇప్పటికే అతడికి టీ20లలో వైస్ కెప్టెన్సీ పదవిని కూడా అప్పజెప్పింది.
ఇక తాజాగా రోహిత్ గైర్హాజరీలో దక్షిణాఫ్రికాలో టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా అతడికే కట్టబెట్టాలని భావిస్తున్నది. దీనిని బట్టి.. భవిష్యత్ లో అన్ని ఫార్మాట్లలో రాహుల్ ను సారథిగా చూసే అవకాశముందని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇదిలాఉండగా.. రోహిత్ గాయపడటంతో దక్షిణాఫ్రికాలో ఇన్నింగ్స్ ను ఎవరు ఓపెన్ చేస్తారు..? అనే ప్రశ్న తలెత్తుతున్నది. రెగ్యులర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు తోడుగా కెఎల్ రాహుల్ ను పంపుతారా..? లేక రోహిత్ శర్మ స్థానంలో వచ్చిన ప్రియాంక్ పాంచల్ ను పంపిస్తారా..? అనేదానిమీద స్పష్టత రావాల్సి ఉంది.
అయితే మయాంక్-రాహుల్ జోడీ మీదే జట్టు యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నది. వీళ్లిద్దరూ పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఓపెనింగ్ జోడీ గా ఆడారు. అంతేగాక ఈ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే పాంచల్.. తుది జట్టులో ఉంటే మాత్రం అప్పుడు ఓపెనింగ్ సమస్య తప్పకుండా ఉత్పన్నమయ్యే అవకాశముంది. డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు మొదలుకానున్నది.